News February 28, 2026

BOB క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అప్లైకి గడువు పెంపు

image

BOB క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు అప్లై చేయడానికి మార్చి 15 వరకు గడువును పొడిగించారు. మేనేజర్, AVP ఫైనాన్స్& అకౌంట్స్, స్టేట్ హెడ్ రిటైల్ బ్రోకింగ్ పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు careers@bobcaps.in ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, PG/CA/MBA అర్హతతో పాటు పనిఅనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.bobcaps.in

Similar News

News February 28, 2026

MVRCలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ లిమిటెడ్(MVRC)లో 10 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో BE/BTech, ME/MTech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. స్క్రీనింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://mrvc.indianrailways.gov.in

News February 28, 2026

క్యూబాను స్నేహపూర్వకంగా స్వాధీనం చేసుకుంటాం: ట్రంప్

image

వెనిజులా అధ్యక్షుడు మదురో అరెస్ట్, గ్రీన్‌లాండ్‌పై బెదిరింపుల తర్వాత US అధ్యక్షుడు ట్రంప్ కన్ను క్యూబాపై పడింది. ఆ దేశాన్ని స్నేహపూర్వకంగా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. విదేశాంగ కార్యదర్శి రూబియో ఆ దేశ నాయకులతో చర్చలు జరుపుతున్నారన్నారు. ‘నేను చిన్నప్పటి నుంచి క్యూబా గురించి వింటున్నా. అదొక విఫల దేశం. డబ్బుల్లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. వారు మా సాయం కోరుకుంటున్నారు’ అని చెప్పారు.

News February 28, 2026

గోల్డ్ లోన్ ఎప్పుడు తీసుకోవాలి?

image

మెడికల్ ఎమర్జెన్సీ, అత్యవసర బిజినెస్ అవసరాలు లేదా క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నప్పుడే గోల్డ్ లోన్ తీసుకోవాలి. పర్సనల్ లోన్ దొరకని పరిస్థితుల్లో ఈ లోన్ బెస్ట్ ఛాయిస్. దీన్ని చాలా ఫాస్ట్‌గా ప్రాసెస్ చేస్తారు. సమయం తక్కువగా ఉన్నప్పుడు దీనికి మొగ్గు చూపాలి. నెలవారీ ఖర్చులు, వెకేషన్లు, లగ్జరీ వస్తువుల కోసం బంగారాన్ని తాకట్టు పెట్టొద్దు. లేదంటే అధిక వడ్డీ భారంతో పాటు నగలను కోల్పోయే రిస్క్ ఉంటుంది.