News February 28, 2026
శ్రీసిటీలో భారీ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు

శ్రీసిటీకి మరో భారీ పరిశ్రమ రానుంది. జపాన్‌కు చెందిన ప్రొటీరియల్ లిమిటెడ్ సంస్థ రూ.700కోట్లతో ఎలక్ట్రికల్ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనుంది. దేశంలోనే తొలిసారి బొగ్గుతో కాకుండా మొత్తం విద్యుత్తు ద్వారా ఎల్లాయ్ రిబ్బన్‌ను ఉత్పత్తి చేయనుంది. రెండో దశలో మరో రూ.700కోట్లు పెట్టనుంది. ముందుగా 200 మందికి.. తర్వాత 500మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. ఈ ఏడాది చివరిలో కంపెనీ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి.
Similar News
News March 4, 2026
నెల్లూరు: డ్రగ్స్ వద్దు బ్రో అంటూ..!

నెల్లూరు జిల్లాను “డ్రగ్ ఫ్రీ” జిల్లాగా మార్చే లక్ష్యంతో ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 988 ఈగల్ క్లబ్స్, 24 డ్రోన్లతో నిఘా పెంచారు. “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నారు.
News March 4, 2026
నెల్లూరు జిల్లా నేతలకు నారా లోకేశ్ ఆత్మీయ విందు

నెల్లూరు జిల్లా ప్రజా ప్రతినిధులకు ఉండవల్లిలోని తన నివాసంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు జిల్లాకు చెందిన అందరూ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పలు అంశాలపై మంత్రి వారితో చర్చించారు. అనంతరం అందరికీ కానుకలు అందజేశారు.
News March 3, 2026
నెల్లూరు: ప్రేమికుల మృతి.. ఎలా గుర్తించారంటే?

రాపూరు-చిట్వేల్ ఘాట్ రోడ్డులోని అడవిలో ప్రేమికులు <<19290866>>ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. మృతులు ముత్తుకూరు మండలం పంటపాలేనికి ఆలపాక ప్రసన్న కుమార్(24), చిట్టమూరు మండలం చింతలతోపునకు చెందిన ఎం.సావిత్రి(26)గా గుర్తించారు. తేనె సేకరణ కోసం అడవిలోకి వెళ్లిన పంగిలి గ్రామస్థులు మృతదేహాలను చూశారు. సమీపంలోని బైకుపై దొరికిన హ్యాండ్ బ్యాగులో ఉన్న ఫోన్ల ఆధారంగా మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.


