News February 28, 2026

ఖమ్మం: మోడల్ స్కూల్స్ ప్రవేశాలకు నేడే లాస్ట్ డేట్

image

రాష్ట్రవ్యాప్తంగా మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో మొత్తం సీట్లు, 7-10వ తరగతుల్లో మిగిలిన సీట్ల ప్రవేశాల దరఖాస్తుకు నేడే చివరి తేదీ. ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధన ఉంటుంది. విద్యార్థులు https://tgms.telangana.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దరఖాస్తుకు ఈరోజే లాస్ట్ డేట్ కావున ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లాలోని మోడల్ స్కూల్స్ ప్రిన్సిపల్స్ కోరారు.

Similar News

News March 1, 2026

సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు: రాజగోపాల్ రెడ్డి

image

TG: సీఎం రేవంత్‌‌పై ఓ వైపు ప్రశంసలు కురిపిస్తూనే మరోవైపు తనదైన శైలిలో మునుగోడు MLA రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ‘మునుగోడుకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసినందుకు CMకు ధన్యవాదాలు. విద్యావ్యవస్థలో మార్పులు తెస్తున్నారు. గత ప్రభుత్వం విద్యను గాలికి వదిలేసింది’ అని అన్నారు. మరోవైపు హైదరాబాద్‌కు పక్కనే ఉన్న మునుగోడును పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అభివృద్ధిలో ఇంకా వెనుకబడి ఉందని పేర్కొన్నారు.

News March 1, 2026

హనుమకొండ జిల్లాలో తీవ్ర విషాదం

image

జిల్లాలోని కమలాపూర్ మండలం లక్ష్మీపూర్ వద్ద బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. శనిగరంలో స్నేహితుడి అంత్యక్రియలకు హాజరై శనిగరం నుంచి కమలాపూర్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులను శనిగరానికి చెందిన వట్టెంల నాగరాజు (20), బండి వినయ్ (18)గా గుర్తించారు.

News March 1, 2026

చరిత్ర పుటల్లో గద్వాల రాజకుమారి వివాహ వైభవం

image

ఆందోల్-పాపన్నపేట సంస్థానాధీశుడితో గద్వాల సంస్థానాధీశుల కుమార్తె వివాహం అత్యంత వైభవంగా జరిగింది. గద్వాల రాజులు తన కుమార్తెకు అపురూపమైన కానుకలను అరణంగా సమర్పించారు. ఇందులో ముఖ్యంగా పచ్చల హారం ధరించిన తెల్లని పంచకళ్యాణి గుర్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ గుర్రానికి ఒక కాలికీ వెండి, మరో కాలికీ బంగారు కడియాలు అమర్చారు. కేవలం కానుకలే కాకుండా, భారీ సంఖ్యలో దాసదాసీలు 3 వేల మంది సైనికులు కూడా వెళ్లారు.