News February 28, 2026
ఖమ్మం: గైర్హాజరు, నిర్లక్ష్యం.. 50 మంది టీచర్లకు నోటీసులు

ఖమ్మం జిల్లాలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన 50 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులపై డీఈవో చైతన్య జైని శుక్రవారం చర్యలు చేపట్టారు. కారణం లేకుండా గైర్హాజరైన 24 మందికి, అనుమతి లేకుండా ఓడీ పేరుతో గైర్హాజరైన 14 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దెందుకూరు జడ్పీహెచ్‌ఎస్ ఉపాధ్యాయుడిపై ఫిర్యాదుల నేపథ్యంలో నోటీసులు జారీ చేశారు. ఏన్కూరు ఎంపీపీ స్కూల్ హెచ్ఎంను సస్పెండ్ చేశారు.
Similar News
News March 2, 2026
తెలుగు సినిమాకి తెలుగులో టైటిల్ ఏది?

తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమిళ హీరో సూర్య నటిస్తున్న సినిమాకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే టైటిల్ ఖరారైంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మూవీ టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్లపై విమర్శలొస్తున్నాయి. మూవీ టీమ్ తమిళం, ఇంగ్లిష్‌లోనే పోస్టర్లు రిలీజ్ చేసింది. తెలుగులో టైటిల్ పోస్టర్ ఇవ్వలేదు. దీంతో తెలుగు టైటిల్ ఎందుకు లేదు? తెలుగంటే నిర్లక్ష్యం ఎందుకు? అంటూ తెలుగు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
News March 2, 2026
జనగామ: చేనేత పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

జనగామ జిల్లాలోని చేనేత కళాకారులు, డిజైనర్లు, మార్కెట్లలో ప్రతిభను గుర్తించి గౌరవించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటించింది. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం – 2025లో భాగంగా ‘సంత్ కబీర్’ మరియు ‘జాతీయ చేనేత’ అవార్డుల కోసం ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా చేనేత, జౌళి శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆసక్తి గల వారు ఈ నెల 23 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
News March 2, 2026
బాపట్ల: సైనిక సంక్షేమానికి రూ.10.54 లక్షల విరాళం

సైనిక సంక్షేమానికి బాపట్ల జిల్లా అండగా నిలిచింది. సైనిక్ వెల్ఫేర్ ఫండ్‌కు జిల్లా తరఫున సమకూరిన రూ.10,54,304 విరాళాన్ని కలెక్టర్ వినోద్ కుమార్ చేతుల మీదుగా చెక్కు రూపంలో సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా దేశ రక్షణ కోసం మాజీ సైనికులు చేసిన విశేష సేవలను కలెక్టర్ ప్రత్యేకంగా కొనియాడారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ, అధికారులు, పాల్గొన్నారు.


