News February 28, 2026
మహిళల్లో లంగ్ క్యాన్సర్ ముప్పు

మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదకరంగా మారిందని WHO ఆందోళన వ్యక్తం చేసింది. ఇండోర్, ఔట్‌డోర్ వాయు కాలుష్యం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం, చిన్న వయసులోనే మరణించే అవకాశం స్త్రీలలోనే అధికంగా ఉంది. బయో ఇంధనాలు, వంట నుంచి వచ్చే పొగకు ఎక్కువగా గురికావడం, చికిత్సను నిర్లక్ష్యం చేయడం వల్ల లంగ్ క్యాన్సర్ ముప్పు పెరిగిపోతోందని, మహిళలు వాయుకాలుష్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతోంది.
Similar News
News March 1, 2026
హైదరాబాద్‌లో టీచింగ్ పోస్టులు

<
News March 1, 2026
ఆరోగ్యం కోసం ఏం మానేయాలంటే?

బాలార్కో ప్రేతధూమశ్చ వృద్ధా స్త్రీ పల్వలోదకమ్|
రాత్రౌ దధ్యన్నభుక్తిశ్చ ఆయుఃక్షీణం దినే దినే||
సూర్యోదయ సమయంలో వచ్చే ఎండ, శ్మశానంలోని దహన పొగ, వయసు మళ్లిన స్త్రీతో పొందు, నిల్వ ఉన్న మురికి గుంటలోని నీరు తాగడం, రాత్రి పెరుగన్నం తినడం మంచిది కాదు. దీనివల్ల ఆయుష్షు రోజురోజుకూ క్షీణిస్తుంది. రాత్రిపూట పెరుగుకు బదులుగా పాలు తీసుకోవచ్చు. పాలన్నం కూడా ఆరోగ్యకరమే. ఈ నియమాలను పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం.
News March 1, 2026
సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో జూనియర్ ఆఫీసర్/బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు పనిఅనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఏడాదికి రూ.7.56లక్షలు చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు లేదు. వెబ్‌సైట్: recruit.southindianbank.bank.in


