News February 28, 2026

ఆసిఫాబాద్: డిగ్రీ విద్యార్థి సూసైడ్

image

రెబ్బెన (M) దుర్గాపూర్‌కు చెందిన మడావి అజయ్(18) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ వెంకట కృష్ణ కథనం ప్రకారం.. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న అజయ్ 2 సంవత్సరాలుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. గత నెల 27న వైద్యం కోసమని వెళ్లి గ్రామ శివారులో పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తుండగా శుక్రవారం మృతి చెందాడు.

Similar News

News March 2, 2026

T20WC: టీమ్ఇండియా చెత్త ఫీల్డింగ్

image

భారత జట్టు సెమీస్‌కు చేరినా ఫీల్డింగ్ కలవరపెడుతోంది. నిన్న WIతో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లోనూ 3 క్యాచులు వదిలేసింది. ఈ WCలో ఇప్పటి వరకు 13 క్యాచులను నేలపాలు(71.7% ఎఫిషియెన్సీ) చేసింది. ఆ తర్వాత స్థానంలో శ్రీలంక(11) ఉంది. నిన్న మ్యాచ్ విన్ కావడంతో దీనిపై పెద్దగా చర్చ జరగలేదని క్రీడావర్గాలు అంటున్నాయి. రానున్న మ్యాచుల్లో ఇదే కంటిన్యూ అయితే వరల్డ్ కప్ సాధించాలనే ఆశలు వదులుకోవాల్సిందే అని చెబుతున్నారు.

News March 2, 2026

గద్వాల జిల్లాలో రెండు నెలల్లో 14 పోక్సో కేసులు!

image

గద్వాల జిల్లాలో బాలికలపై అకృత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత రెండు నెలల్లో ఏకంగా 14 పోక్సో కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. తాజాగా పాఠశాల వద్ద బైక్‌పై దింపుతామని నమ్మించి విద్యార్థినిపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. పోలీసులు నిందితులను వెంటనే అరెస్ట్ చేశారు. బాలల భద్రత అందరి బాధ్యతని, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని.. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే 100కి డయల్ చేయాలని పోలీసులు సూచించారు.

News March 2, 2026

వరంగల్: తండ్రి ఫోన్ కొనివ్వలేదని కూతురు ఆత్మహత్య

image

తండ్రి ఫోన్ కొనివ్వలేదని బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. మిల్స్ కాలనీ CI రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం కలహంది మండలానికి చెందిన భారత్ ఉరుసు శివారు అమ్మవారిపేట ఇటుక బట్టీలలో పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు. తండ్రిని మూడో కుమార్తె(15) ఫోన్ అడగ్గా తర్వాత కొనిస్తానని చెప్పాడు. మనస్తాపం చెంది ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. కేసు నమోదైంది.