News May 4, 2024

మహిళలు, బాలికలను వేధిస్తే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ చందనా దీప్తి

image

నల్గొండ జిల్లా షీ టీం బృందాలు మహిళా రక్షణలో ముందుంటూ ఎలాంటి ఆపద వచ్చిన వెంటనే స్పందిస్తూ రక్షణ కల్పిస్తుందని జిల్లా ఎస్పీ స్పందన దీప్తి తెలిపారు. మహిళలను, యువతులను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా షీ టీం బృందాలు అన్ని ప్రాంతాలలో డేగ కళ్ళతో పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. మహిళలు, యువతులు, బాలికలను ఎవరైనా లైంగికంగా వేధించిన, ఈవ్ టీజింగ్ పాల్పడిన కఠిన చర్యలు తప్పవన్నారు.

Similar News

News March 19, 2026

నల్గొండ: పుచ్చకాయకు దక్కని ధర: రైతు కుదేలు

image

ఈ వేసవిలో జిల్లాలో సుమారు 2000 ఎకరాల్లో పుచ్చకాయ సాగు చేసిన రైతులు మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పెద్దవూర మండలంలోని పలు గ్రామాల్లో సాగు పెరగడం, పంట ఒక్కసారిగా మార్కెట్‌కు రావడంతో గతంలో రూ.30 పలికిన ధర ప్రస్తుతం రూ.6 నుండి 7కి పడిపోయింది. దీంతో పెట్టుబడి కూడా రాక రైతులు భారీ నష్టాలను చవిచూస్తున్నారు. సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

News March 19, 2026

పీసీసీ అంశంపై మంత్రి కోమటిరెడ్డి స్పష్టత

image

పీసీసీ అధ్యక్ష పదవి మార్పుపై వస్తున్న వార్తలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌ గౌడ్‌పై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. ఆయన సారథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిందని గుర్తుచేశారు. జగ్గారెడ్డి పనితీరును ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని అయన తెలిపారు.

News March 19, 2026

నల్గొండ: జాతీయ ఫుట్‌బాల్‌లో తేజు ప్రతిభ

image

హాలియాకు చెందిన చింతలచెరువు తేజు జాతీయ స్థాయి ఫుట్‌బాల్‌లో ప్రతిభ చాటుతున్నాడు. చిన్న వయసులోనే క్రమశిక్షణతో సాధన చేస్తూ ముందుకు సాగుతున్నాడు. హరియాణాలో జరిగిన అండర్-17 జాతీయ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. స్థానికులు తేజును అభినందిస్తున్నారు. భవిష్యత్తులో మరింత రాణించాలని ఆశిస్తున్నారు.