News February 28, 2026
అఫ్గాన్‌తో వార్.. పాక్‌పై ట్రంప్ పొగడ్తలు

అఫ్గాన్‌తో నెలకొన్న సరిహద్దు వివాదాన్ని యుద్ధంగా మార్చిన పాక్‌పై ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆ దేశ ప్రధాని, ఆర్మీ జనరల్‌ను అద్భుతమైన నాయకులుగా అభివర్ణించారు. వారిని తాను ఎంతో గౌరవిస్తానన్నారు. ఈ వివాదంలో జోక్యం చేసుకునే అవకాశం తనకు ఉన్నప్పటికీ.. అలా చేయబోనని పేర్కొన్నారు. మరోవైపు తాలిబన్ దాడుల నుంచి తనను తాను రక్షించుకునే హక్కు పాక్‌కు ఉందని అమెరికన్ స్టేట్ డిపార్ట్‌మెంట్ చెప్పుకొచ్చింది.
Similar News
News February 28, 2026
దంచికొట్టనున్న ఎండలు.. జాగ్రత్త!

AP: ఈ ఏడాది మార్చి నుంచి మే వరకు సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఆస్కారముందని APSDMA తెలిపింది. సెంట్రల్ ఆంధ్రలో ఎక్కువ రోజుల పాటు వడగాలులు వీస్తాయంది. ఎండతీవ్రత నేపథ్యంలో ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు క్యాప్, కర్చీఫ్, తెలుపు రంగు వస్త్రాలను సిద్ధం చేసుకోవాలని చెప్పింది. అలాగే వేసవి తాపం తగ్గించుకోవడానికి ఇంటి పరిసరాల్లో మొక్కలు పెంచుకోవాలని సూచించింది.
News February 28, 2026
అమెరికాVsఇరాన్.. ఎవరి బలం ఎంత?

☛ డిఫెన్స్ బడ్జెట్: USA $895B, ఇరాన్ $15.4B
☛ యాక్టివ్ మిలిటరీ సిబ్బంది: USA 13.28L, ఇరాన్ 6.10L
☛ రిజర్వ్ మిలిటరీ: USA 7.99L, Iran 3.5L
☛ ఎయిర్‌క్రాఫ్ట్ ఫైటర్స్: USA 1,790, Iran:188
☛ న్యూక్లియర్ వార్ హెడ్స్: USA: 5,244, Iran: 0
☛ అటాక్ హెలికాప్టర్లు: USA: 1,002, Iran: 13
☛ ట్యాంక్స్: USA: 4,640, Iran: 1,713
☛ సబ్‌మెరైన్స్: USA: 70, Iran: 25
News February 28, 2026
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. సంయమనం పాటించాలన్న భారత్

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ పరిస్థితిపై ఆందోళన చెందుతున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని కోరింది. US, ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గించి, పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలంది. మరోవైపు మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉద్రిక్తత వేళ DGCA కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా దేశాలకు విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపేయాలని పేర్కొంది. కాగా Air India ఇప్పటికే తన సర్వీసులను రద్దు చేసింది.


