News February 28, 2026

JNTUH ప్రొఫెసర్ల ప్రమోషన్లలో స్పష్టత లేదు

image

జేఎన్టీయూ ప్రొఫెసర్లకు CAS ప్రమోషన్ల విషయంలో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. గతంలో నిర్వహించిన ఈసీ మీటింగ్‌లో ఈ ప్రమోషన్లు విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి JNTUH అధికారులు తీసుకొని రాగా ఆ ఫైలు ముందుకు కదల్లేదు. శుక్రవారం సైతం నిర్వహించిన మీటింగ్‌లో దీనిపైనా స్పష్టత రాలేదు. గత డిసెంబర్ ప్రొఫెసర్లకు ఇంటర్వ్యూ చేపట్టారు. ఇది ఇలానే కొనసాగితే గడువు ముగిసి మరోసారి ఇంటర్వ్యూలు చేపట్టాల్సి వస్తుంది.

Similar News

News March 2, 2026

కామారెడ్డి: లీగల్ ఎయిడ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ

image

సైబర్ నేరాల బారిన పడి ఆర్థికంగా నష్టపోయిన బాధితులకు తిరిగి నగదు పొందెందుకు తక్షణ సహాయం అందించేందుకు లీగల్ ఎయిడ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర వెల్లడించారు. బాధితులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 15100 లేదా సమీప పోలీస్ స్టేషన్, లేదా జిల్లా సైబర్ క్రైమ్ సెల్‌ను సంప్రదించాలన్నారు.

News March 2, 2026

సంప్రదాయ పద్ధతుల్లో హోలీ జరుపుకుందాం: వరంగల్ సీపీ

image

సంప్రదాయ పద్ధతుల్లో జరుపుకుందామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రజలకు పిలుపునిచ్చారు. హోలీ పండుగ సందర్బంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు ప్రజలకు పలు సూచనలు చేస్తూ సహజ సిద్దమైన రంగులను వినియోగిస్తూ హోలీ పండుగను ప్రశాంతవంతమైన వాతావరణంలో జరుపుకోవాలన్నారు. హోలీ అనంతరం యువత స్నానాల కోసం శివారు ప్రాంతాల్లోని చెరువులు, లోతట్టు ప్రాంతాలకు వెళ్లొద్దని సీపీ పేర్కొన్నారు.

News March 2, 2026

NZB: హోలీ పండుగకు పటిష్ట భద్రత ఏర్పాట్లు: సీపీ

image

హోలీ పండుగ నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు నిజామాబాద్ సీపీ సాయి చైతన్య సోమవారం పేర్కొన్నారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో సహజసిద్ధమైన రంగులతో పండుగను జరుపుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో స్నానాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై దృష్టి సారించాలన్నారు.