News February 28, 2026
రాష్ట్రంలో ఖమ్మం ఫస్ట్.. 30వ స్థానంలో భద్రాద్రి

ఖమ్మం జిల్లా రాష్ట్రంలో రైతు రిజిస్ట్రీలో తొలి స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 75.21% మంది రైతులు వివరాలు నమోదు చేసుకోగా, వారం రోజుల్లో 100% పూర్తి చేయాలని లక్ష్యంగా వ్యవసాయశాఖ కృషి చేస్తోంది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 53.15% మాత్రమే నమోదై రాష్ట్రంలో 30వ స్థానంలో ఉంది. పీఎం కిసాన్ సహా కేంద్ర పథకాల లబ్ధికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని అధికారులు సూచించారు.
Similar News
News March 3, 2026
సీఎం సమీక్షలో పాల్గొన్న భూపాలపల్లి కలెక్టర్

రాష్ట్రవ్యాప్తంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు నిర్వహించనున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” అమలుపై సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు, ప్రభుత్వ ముఖ్య సలహాదారులతో పాటు భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలని సీఎం దిశానిర్దేశం చేశారు.
News March 3, 2026
ఇద్దరిని కాపాడి… చివరికి గోదావరిలో గల్లంతయిన ప్రసాద్

మణుగూరు మండలంలో ఇద్దరు వ్యక్తులు గల్లంతైన విషయం తెలిసిందే. కాగా పద్మగూడెంకు చెందిన పదిమంది మంగళవారం మల్లేపల్లి గోదావరి నది ఒడ్డుకు వచ్చారు. అక్కడే వంటలు చేసుకుని సరదాగా గోదావరి ఒడ్డున ఈత కొడుతుండగా ముగ్గురు ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగిపోతుండగా పద్దం ప్రసాద్ ఇద్దరిని కాపాడి, మరో వ్యక్తి నాగేశ్వరరావును కాపాడబోయి, ప్రసాద్ గల్లంతయ్యాడని ప్రత్యక్ష సాక్షి ప్రసాద్ కుమారుడు తెలిపారు.
News March 3, 2026
KNR: పండుగకు పిలిచినందుకు కత్తితో దాడి

సైదాపూర్ మండలం రాంచంద్రపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. సింగరేణి రిటైర్డ్ కార్మికుడైన రవీందర్ మద్యానికి బానిసై ఇంటికి దూరంగా ఉంటున్నాడు. పండుగకు ఇంటికి రమ్మని కొడుకు రాకేశ్(32) కోరగా, రవీందర్ నిరాకరించి వాగ్వాదానికి దిగాడు. ఆ కోపంతో కిరాణం షాపునకు వెళ్లిన కొడుకు చేతిపై కత్తితో దాడి చేశాడు. గాయపడిన రాకేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై స్వాతి తెలిపారు.


