News February 28, 2026
NGKL: అంతుచిక్కని కుమ్మెర ఘటన

కుమ్మెర ఘటన రోజురోజుకూ అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేయగా మరో నలుగురు పరారీలో ఉన్నారు. బాధితుల పట్ల పోలీసుల వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్వత్రా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిన్న కాంగ్రెస్ నేతల బృందం గ్రామంలో పర్యటించింది. ఘటనపై NHRC సీరియస్ అయింది. అనేక మలుపులతో అంతుచిక్కని ఈ కేసు చివరకు ఎటువైపు దారితీస్తుందో చూడాలి మరి.
Similar News
News February 28, 2026
అమెరికాVsఇరాన్.. ఎవరి బలం ఎంత?

☛ డిఫెన్స్ బడ్జెట్: USA $895B, ఇరాన్ $15.4B
☛ యాక్టివ్ మిలిటరీ సిబ్బంది: USA 13.28L, ఇరాన్ 6.10L
☛ రిజర్వ్ మిలిటరీ: USA 7.99L, Iran 3.5L
☛ ఎయిర్‌క్రాఫ్ట్ ఫైటర్స్: USA 1,790, Iran:188
☛ న్యూక్లియర్ వార్ హెడ్స్: USA: 5,244, Iran: 0
☛ అటాక్ హెలికాప్టర్లు: USA: 1,002, Iran: 13
☛ ట్యాంక్స్: USA: 4,640, Iran: 1,713
☛ సబ్‌మెరైన్స్: USA: 70, Iran: 25
News February 28, 2026
గోదావరి నది వెంట ఉన్న ఆలయాలను అభివృద్ధి చేయాలి: అడ్లూరి

గోదావరి నది వెంట ఉన్న ఆలయాలను ఆగమ శాస్త్ర పరంగా అభివృద్ధి చేయాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ సూచించారు. గత పుష్కరాలకు భిన్నంగా అభివృద్ధి పనులు చేయాలని, వెహికల్ పార్కింగ్కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కనురెప్పపాటు కరెంటు అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. గోదావరి పుష్కరాలకు నిధుల కేటాయింపు కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానన్నారు.
News February 28, 2026
వేట్లపాలెం ఘటనపై లోకేశ్ దిగ్భ్రాంతి

వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం జరిగిన పేలుడు ఘటనపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో పలువురు మృత్యువాత పడటం కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన, బాధిత కుటుంబాలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.


