News February 28, 2026
VZM: పొట్టకూటి కోసం వెళ్తూ.. మృత్యవాత

తూ.గో. జిల్లా దేవరపల్లి(M) ఎర్నగూడెం హైవే ఫ్లైఓవర్‌పై శనివారం తెల్లవారుజామున లారీ పైనుంచి జారిపడి విజయనగరం జిల్లా వాసి మృతి చెందాడు. గజపతినగరం(M) పాతబగ్గానికి చెందిన పల్లి ప్రసాద్ (24) మరి కొంత మందితో కలిసి కృష్ణాజిల్లా గుడివాడలో మినప చేలు తీత కోసం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు తెలిపారు. నిద్ర మత్తులో ఉండగా లారీ వెనక డోర్ పైనుంచి జారిపడి తలకు దెబ్బ తగిలి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు.
Similar News
News March 3, 2026
అడల్ట్ కంటెంట్‌ను INDలో బ్లాక్ చేసిన X

దేశంలో అశ్లీల కంటెంట్‌ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా X కీలక నిర్ణయం తీసుకుంది. పరస్పర అంగీకారంతో ఇండియాలో అడల్ట్/పోర్న్ వీడియోలను నేటి నుంచి బ్లాక్ చేయనుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో ఈ కంటెంట్ యథావిధిగా అందుబాటులో ఉండనుంది. స్థానిక చట్టాలకు లోబడి ప్లాట్‌ఫామ్‌ను సురక్షితంగా ఉంచడమే దీని ఉద్దేశం. భారత్‌లో ఇకపై ఎటువంటి సెన్సిటివ్ & అడల్ట్ కంటెంట్ Xలో కనిపించదు.
News March 3, 2026
నెల్లూరు: బాలికలకు HPV వాక్సిన్

మహిళల్లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించిండానికి ప్రభుత్వం ఉచితంగా HPV వాక్సిన్‌ను అందుబాటులోకి తేనుంది. నెల్లూరు జిల్లాలో 80 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని 14- 15 ఏళ్ల లోపు బాలికలకు HPV వాక్సిన్ వేయనున్నారు. జిల్లా 24.69 లక్షలు మంది ఉండగా.. ఇందులో ఒక శాతం(24వేలు) మంది బాలికలు 14-15 ఏళ్ల మధ్య ఉండవచ్చని అంచనా. ఎంతో ఖరీదైనా ఈ వాక్సిన్‌ను ప్రతీ ఒక్కరికి అందుబాటులోకి తీసుకురానున్నారు.
News March 3, 2026
ప్రభుత్వ హాస్పిటల్స్ పై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలి: మాజీ మంత్రి

జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చూరిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన నేపథ్యంలో జడ్చర్ల ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీ, వంద పడకల హాస్పిటల్‌ను, నూతనంగా నిర్మించిన మార్చురీ బిల్డింగును మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి మంగళవారం పరిశీలించారు. ప్రభుత్వ చేతగాని తనం వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు. ఘటనకు అధికారులతో పాటు, ప్రజా ప్రతినిధులు కూడా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.


