News February 28, 2026

MVRCలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ లిమిటెడ్(MVRC)లో 10 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో BE/BTech, ME/MTech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. స్క్రీనింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://mrvc.indianrailways.gov.in

Similar News

News March 1, 2026

ఈ రంగు కార్లలో మరింత వేడి!

image

వేసవిలో కారు రంగు ఏసీ పనితీరుపై ప్రభావం చూపుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. తెలుపు వంటి లేత రంగులు సూర్యరశ్మిని పరావర్తనం చేయడంతో క్యాబిన్ త్వరగా చల్లబడుతుంది. కానీ నలుపు వంటి ముదురు రంగులు వేడిని ఎక్కువగా గ్రహిస్తాయి. దీనివల్ల కారు లోపల ఉష్ణోగ్రత 5-10 డిగ్రీలు ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ముదురు రంగు కార్లలో AC కూలింగ్ ఆలస్యమవ్వడమే కాకుండా కంప్రెషర్‌పై భారం పడి మైలేజీ స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది.

News March 1, 2026

ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో 100 పోస్టులు

image

ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్(<>AFMS<<>>) 100 మెడికల్ ఆఫీసర్ పోస్టులను షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయడానికి దరఖాస్తులు కోరుతోంది. MBBS, నీట్ పీజీ ఎగ్జామినేషన్ అర్హత సాధించినవారు మార్చి 4 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు MBBS అర్హత గలవారికి 30ఏళ్లు, పీజీ అర్హత గలవారికి 35ఏళ్లు. ఫిజికల్ ఫిట్‌నెస్ కలిగి ఉండాలి. మార్చి 17న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.join.afms.gov.in

News March 1, 2026

ఖమేనీ హత్య కిరాతకమైన చర్య: పుతిన్

image

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి పట్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతాపం తెలిపారు. ఈ హత్య కిరాతకమైన చర్య అని పేర్కొన్నారు. నైతికత, అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘించి ఖమేనీని చంపారని ధ్వజమెత్తారు. ఈ మేరకు తన ఇరాన్ సన్నిహితుడు మసూద్ పెజెష్కియాన్(ప్రెసిడెంట్)కు రాసిన లేఖలో పేర్కొనట్లు క్రెమ్లిన్ తెలిపింది. ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడిలో ఖమేనీ హతమైన విషయం తెలిసిందే.