News February 28, 2026
ఖమ్మం: రూ.541 కోట్ల సైబర్ మోసంలో నిందితుడి అరెస్టు?

సత్తుపల్లి కేంద్రంగా వెలుగులోకి వచ్చిన రూ.541 కోట్ల భారీ సైబర్ క్రైమ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఎర్రుపాలెం మండలానికి చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీనిపై పోలీసులు ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కుంభకోణంలో నిందితుల మూలాలు వెలికితీసేందుకు అధికారులు విచారణను వేగవంతం చేశారు.
Similar News
News March 3, 2026
జగన్‌ను కలిసిన భట్టి

AP: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌ను కలిశారు. తన కుమారుడి వివాహ ఆహ్వానపత్రికను అందజేసి, వేడుకకు రావాలని కోరారు. జగన్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, వధూవరులు నిండైన దాంపత్య జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ఆత్మీయంగా హత్తుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కాగా భట్టి దివంగత వైఎస్సార్‌ను ఎంతగానో అభిమానిస్తారు.
News March 3, 2026
బనగానపల్లె వద్ద ఆటో బోల్తా.. ఒకరి మృతి, 14 మందికి గాయాలు

బనగానపల్లె మండలం దద్దనాల చెరువు సమీపంలో మంగళవారం ఆటో నియంత్రణ తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 14 మంది వ్యవసాయ కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 3, 2026
విశాఖలో మందగించిన రిజిస్ట్రేషన్లు

ఫిబ్రవరి 1 నుంచి భూముల విలువలు పెరుగుతాయని ప్రచారం జరిగినా ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేయడంతో విశాఖలో రిజిస్ట్రేషన్లు మందగించాయి. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో క్షీణత కనిపించింది. 9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఫిబ్రవరిలో సుమారు రూ.98 కోట్ల ఆదాయం లభించింది. అర్బన్‌లో అపార్ట్మెంట్లు అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. 2025-26కి రూ.1400 కోట్ల లక్ష్యంలో ఫిబ్రవరి నాటికి రూ.952 కోట్లు వసూలయ్యాయి.


