News February 28, 2026

BREAKING: జగిత్యాల జిల్లాలో పెద్దపులి కలకలం!

image

జగిత్యాల జిల్లాలో పెద్దపులి సంచారం వార్త స్థానికంగా కలకలం రేపుతోంది. భీమారం మండలం మోత్కురావుపేటలో 3 మూగ జీవాలపై పెద్దపులి దాడి చేసిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. 2 రోజులుగా పెద్దపులి తమ గ్రామంలో సంచరిస్తోందంటూ గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలిస్తున్నారు. పశువైద్యాధికారులు గాయపడిన మూగజీవాలకు చికిత్స చేశారు.

Similar News

News March 2, 2026

చరిత్రలో ఈరోజు (మార్చి 2)

image

* 1933: బాలీవుడ్ సంగీత దర్శకుడు పద్మశ్రీ ఆనంద్‌జీ వీర్జీ షా జననం
* 1936: రంగస్థల నటుడు అబ్బూరి గోపాలకృష్ణ జననం
* 1962: తెలంగాణ కవి యాకూబ్ జననం
* 1938: నాటకకర్త వడ్డాది సుబ్బారాయుడు మరణం
* 1949: స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత కోకిల సరోజిని నాయుడు మరణం (ఫొటోలో)
* 1990: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళా మంత్రి మసూమా బేగం మరణం

News March 2, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 2, 2026

NZB: వాలీబాల్ తగిలి ఇరువర్గాల మధ్య ఘర్షణ

image

నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ తండాలో వాలీబాల్ కారణంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నట్లు రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. ఫిబ్రవరి 27న తండాకు చెందిన కొందరు యువకులు వాలీబాల్ ఆడుతుండగా విక్రమ్ వాలీబాల్‌ను కొట్టగా అక్కడే ఉన్న బుజ్జి బాయి అనే వృద్ధురాలికి తగిలింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఆదివారం ఇరువర్గాల వారు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.