News February 28, 2026
ఖమేనీ టార్గెట్‌గా దాడులు!

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతం చేయడమే లక్ష్యంగా <<19260918>>అమెరికా-ఇజ్రాయెల్<<>> దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ మిస్సైల్స్ టెహ్రాన్‌లోని ఖమేనీ ఆఫీసులకు, ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ సమీపంలోకి దూసుకెళ్లినట్లు సమాచారం. అయితే ఆయన అప్పటికే సేఫ్ హౌస్‌కు వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. న్యూక్లియర్ డీల్‌కు ఖమేనీనే అడ్డంకి అని పలుమార్లు ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
Similar News
News March 1, 2026
అంగన్వాడీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

AP: రాష్ట్రవ్యాప్తంగా 5వేల మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. మినీ అంగన్వాడీ కార్యకర్తలకు టీచర్లుగా ప్రమోషన్లు, పూర్తి స్థాయి వేతనాలు ఇస్తామన్నారు. అమరావతిలో అంగన్వాడీ కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. కొత్తగా 5,000 మంది అంగన్వాడీ సహాయకులను నియమించనున్నట్లు వెల్లడించారు. వేతనాల పెంపు డిమాండ్‌నూ అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
News March 1, 2026
సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

CSIR-సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 4 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BTech/MTech(కెమికల్ ఇంజినీరింగ్), PhD(ఫిజికల్/కెమికల్ సైన్సెస్), BSc(కెమిస్ట్రీ) ఉత్తీర్ణులు అర్హులు. Sr. ప్రాజెక్ట్ అసోసియేట్‌కు గరిష్ఠ వయసు 40ఏళ్లు కాగా.. ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు గరిష్ఠ వయసు 35ఏళ్లు. మార్చి 6న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. సైట్: www.cecri.res.in/
News March 1, 2026
ఒంటి కన్ను కుబేరుడి కథ మీకు తెలుసా?

కుబేరుడు ఓసారి కైలాసంలో పార్వతీదేవి సౌందర్యాన్ని చూసి ముగ్ధుడవ్వగా ఆమె కోపంతో ఆయన ఎడమకన్ను కాలిపోయింది. తన తప్పు తెలుసుకున్న కుబేరుడు 800 ఏళ్లపాటు కఠినమైన ‘రౌద్ర కేదార వ్రతం’ చేసి శివుడిని మెప్పించాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమై కుబేరుడిని తన స్నేహితుడిగా స్వీకరించాడు. కాలిపోయిన కన్ను స్థానంలో ఓ గవ్వను అమర్చాడు. ఒకే కన్ను, పింగళ వర్ణంలో ఉండటం వల్ల ఆయనను ‘ఏకాక్ష పింగళుడు’ అని పిలుస్తారు.


