News February 28, 2026
ధురంధర్-2 చూశా.. అద్భుతంగా ఉంది: యామీ గౌతమ్

రణ్‌వీర్ సింగ్ నటించిన <<19037836>>ధురంధర్-2<<>> సినిమాను చూసినట్లు నటి యామీ గౌతమ్ వెల్లడించారు. ఈ మూవీ కోసం తన భర్త, డైరెక్టర్ ఆదిత్య ధర్ చేసిన వర్క్‌ను చూసి గర్వపడుతున్నట్లు తెలిపారు. ‘ఈ చిత్రం అంచనాలకు మించి ఉంటుంది. ఇది చూసి ఎమోషనల్ అయ్యాను. ఆదిత్య దేశాన్ని, ప్రేక్షకులను ఎంతో ప్రేమిస్తారు. సినిమాను చూసిన ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. ఇదొక ఇండియన్ మూవీ అని గర్వంగా చెప్పుకుంటారు’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
Similar News
News March 1, 2026
రెండు రోజుల పాటు శ్రీవారి SSD టోకెన్లు రద్దు

AP: నేడు, రేపు శ్రీవారి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ రద్దు చేసింది. ఈనెల 3న చంద్రగ్రహణం కారణంగా ఈనెల 2, 3 తేదీలకు సంబంధించిన SSD టోకెన్లను క్యాన్సిల్ చేసింది. మళ్లీ 4వ తేదీకి సంబంధించిన టోకెన్లను ఈనెల 3న జారీ చేస్తారు. ఇక 3న వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసింది.
News March 1, 2026
పెరిగిన చికెన్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ట్రిపుల్ సెంచరీ దాటాయి. హైదరాబాద్‌లో కేజీ స్కిన్‌లెస్ ధర రూ.280-300గా ఉంది. అటు ఏపీలోని విజయవాడలో రూ.270, విశాఖలో రూ.300, గుంటూరులో రూ.250గా ఉంది. మరి మీ ఏరియాలో చికెన్ రేటు ఎంత ఉందో కామెంట్ చేయండి.
News March 1, 2026
సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు

సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(CEL)లో 34 పోస్టులకు అప్లై చేయడానికి మార్చి 3 ఆఖరుతేదీ కాగా.. మార్చి 14వరకు పొడిగించారు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE/BTech, ME/MTech, PhD, MBA/PGP/PGDM, LLB, CA/CMA, టెన్త్, డిగ్రీ, పీజీ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1,000, SC, ST, PwBDలకు ఫీజు లేదు. రాత పరీక్ష, DV, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: https://www.celindia.co.in


