News February 28, 2026

22,195 ప్రభుత్వ ఉద్యోగాలు.. 2 రోజులే ఛాన్స్

image

రైల్వేలో 22,195 గ్రూప్-D ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 2 లాస్ట్ డేట్. సికింద్రాబాద్ పరిధిలో 1,012 పోస్టులున్నాయి. జాబ్‌ను బట్టి టెన్త్, సంబంధిత ట్రేడులో ఐటీఐ పాసై, 18-36 ఏళ్ల వయసు ఉన్న వారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి ఏజ్‌లో సడలింపు ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: https://www.rrbapply.gov.in/

Similar News

News March 1, 2026

సండేను ఫండేగా మార్చుకోండి

image

వారమంతా బిజీగా గడిపిన చాలా మందికి సండే అంటే రెస్ట్‌డే. ఎక్కువసేపు నిద్రపోయేందుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే ఆదివారాన్ని ప్రొడక్టివ్‌గా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కుటుంబంతో సమయం గడపడం, బుక్ రీడింగ్, వాకింగ్‌, గదిని సర్దుకోవడం, ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవడం వంటివి చేస్తే స్ట్రెస్ తగ్గుతుందని అంటున్నారు. దీంతో పాటు వచ్చేవారంలో చేయాల్సిన పనులపై ప్లాన్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు.

News March 1, 2026

ఇరాన్‌పై అమెరికా దాడులకు అదే కారణమా?

image

ఓవైపు చర్చలు కొనసాగుతుండగా సడన్‌గా ఇరాన్‌పై ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా దాడులు చేయడం చర్చనీయాంశమైంది. అయితే ఇరాన్ వైఖరి పట్ల అధ్యక్షుడు ట్రంప్ అసంతృప్తి చెందడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇరాన్ మొదట నుంచి న్యూక్లియర్ అగ్రిమెంట్‌ చర్చలపై నిజాయితీగా లేదని US అధికారులు చెబుతున్నారు. పౌరుల అవసరాల కోసం ఉచితంగా న్యూక్లియర్ ఫ్యూయెల్ అందిస్తామన్నా ఇరాన్ యురేనియమ్‌పై పట్టుబట్టిందని తెలిపారు.

News March 1, 2026

సంక్రాంతి తర్వాత డల్ టాలీవుడ్ డల్

image

సంక్రాంతికి కళకళలాడిన టాలీవుడ్ బాక్సాఫీసు ఆ తర్వాత డల్ అయింది. పండగ తర్వాత రిలీజైన తెలుగు సినిమాలు ఆ రేంజ్ ఆదరణ దక్కించుకోలేకపోయాయి. గత నెలరోజుల్లో రిలీజైన 10 సినిమాల్లో ఏ ఒక్కటీ మంచి కలెక్షన్స్ రాబట్టుకోలేకపోయింది. పెద్ద సినిమాలు లేకపోవడం, టికెట్ ధరలు, ఓటీటీలకు ఆడియన్స్ ప్రాధాన్యం ఇవ్వడం మొదలైనవి కారణాలుగా తెలుస్తోంది. అయితే ఈనెల, ఏప్రిల్‌లో బడా సినిమాల రిలీజ్‌తో పరిస్థితి మారే అవకాశం ఉంది.