News February 28, 2026

‘గద్వాలను అభివృద్ధి పథంలో నడిపిద్దాం’

image

గద్వాల జిల్లా నూతన కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌ను జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణ, పౌర సేవలపై ఇరువురు అధికారులు చర్చించారు. అధికారులందరి సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
అభివృద్ధి పథంలో నడిపిద్దాం

Similar News

News March 2, 2026

NZB: ఇంటర్ పరీక్షలకు.. 687 మంది విద్యార్థులు గైర్హాజరు

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో భాగంగా సోమవారం మ్యాథ్స్-1 ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. NZB జిల్లా వ్యాప్తంగా 21,473 మంది విద్యార్థులకు 687 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు అధికారులు తెలిపారు. 18,695 మంది జనరల్ విద్యార్థుల్లో 525 మంది, 2,778 ఒకేషనల్ విద్యార్థులకు 162 మంది పరీక్షలకు గైర్హాజరు అయ్యారని అధికారులు వివరించారు.

News March 2, 2026

సౌదీ, బహ్రెయిన్ పాలకులకు మోదీ ఫోన్

image

గల్ఫ్ దేశాధినేతలకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. సౌదీ అరేబియా ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఖలీఫాతో మాట్లాడారు. ఆ దేశాల్లో భారతీయుల భద్రత గురించి అడిగి తెలుసుకున్నారు. సౌదీ, బహ్రెయిన్‌పై దాడిని ఖండించారు.

News March 2, 2026

చట్టపరంగా న్యాయం చేస్తాం: ఎస్పీ

image

ఫిర్యాదుల పరిష్కార వేదికలో స్వీకరించిన ఫిర్యాదులపై చట్టప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని విక్రాంత్ పాటిల్ హామీ ఇచ్చారు. ఎస్పీ ఆఫీసులో నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 103 ఫిర్యాదులు స్వీకరించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని మోసాలు, ఆస్తి వివాదాలు, రుణ చెల్లింపుల సమస్యలు తదితర అంశాలపై వచ్చిన వినతులను అధికారులు నమోదు చేసి, తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.