News February 28, 2026

బాపట్లలో పింఛన్ పంపిణీ చేసిన కలెక్టర్

image

బాపట్ల మున్సిపాలిటీలో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పెన్షన్లు సమయానికి, పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో, తహశీల్దార్ ఉన్నారు.

Similar News

News March 7, 2026

కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుల కోసం దరఖాస్తులు: సుగుణ

image

ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు ఉమ్మడి ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులను నియమించనున్నట్లు డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క తెలిపారు. మార్చి 13లోపు మండల అధ్యక్షుల ఎంపిక, 23లోపు పూర్తిస్థాయి కమిటీల ఏర్పాటు పూర్తి చేస్తామన్నారు. ఈ మేరకు మండల కేంద్రాల్లో నిర్వహించే సమావేశాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి ఉన్న నాయకులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 7, 2026

కేయూలో రెండు రోజుల జాతీయ సదస్సు

image

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా, కాకతీయ విశ్వవిద్యాలయ సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ సదస్సు ఈనెల 9, 10 తేదీలలో నిర్వహించనున్నారు. విశ్వవిద్యాలయ సెనెట్ హాల్‌లో “literature, leadership and innovation women shaping viksith bharat – 2047”, అనే అంశంపై ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయని సంచాలకులు డాక్టర్ బి.దీపా జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు,

News March 7, 2026

తాడికొండలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

image

తాడికొండలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. Nine One Exchange యాప్ ద్వారా బెట్టింగ్ చేస్తున్న కిరణ్, గోపీ, వంశీ, ప్రతాప్‌లను అదుపులోకి తీసుకుని 4 ఫోన్లు, కంప్యూటర్ సామగ్రి, ₹3,550 స్వాధీనం చేసుకున్నారు. తాడికొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.