News May 4, 2024

నంద్యాల జిల్లాలో ఈ సెగ్మెంట్ సమస్యాత్మకం: సీఈఓ

image

ఏపీలో 14 అసెంబ్లీ సెగ్మెంట్లు సమస్యాత్మకమైనవని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఇందులో నంద్యాల (D) ఆళ్లగడ్డ నియోజకవర్గ అసెంబ్లీ స్థానం ఒకటిగా ఆయన పేర్కొన్నారు. ఈ సెగ్మెంట్ పరిధిలో 100% వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. పోలీసులు, కేంద్ర బలగాలతో కూడిన భారీ భద్రత నడుమ ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఈఓ స్పష్టం చేశారు.

Similar News

News March 5, 2026

పరీక్షలను పగడ్బందీగా నిర్వహించండి: కలెక్టర్

image

ఈనెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జిల్లాలో జరగబోయే పదో తరగతి పరీక్షలను అధికారులు పగడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. గురువారం కర్నూలులోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ అధికారులతో సమీక్ష చేశారు. జిల్లా వ్యాప్తంగా 160 పరీక్ష కేంద్రాలలో అన్ని వసతులను ఒకరోజు ముందుగానే పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలన్నారు.

News March 5, 2026

ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 436 మంది గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 436 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. 10,742 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా.. 10,305 మంది మాత్రమే హాజరయ్యారని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదన్నారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఆయన స్పష్టం చేశారు.

News March 5, 2026

విందులు చేశారు.. పరిశుభ్రత మరిచారు!

image

కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి, జాయింట్ కలెక్టర్ ఛాంబర్ సమీపంలో కొందరు అధికారులు విందులు చేసి, ఆ ప్రాంతాన్ని అపరిశుభ్రం చేశారు. ప్రతీ శనివారం పారిశుద్ధ్యంపై ప్రతిజ్ఞ చేయించే కలెక్టర్ కార్యాలయ సమీపంలో ఇలా చేయడమేంటని ప్రజలు చర్చించుకుంటున్నారు. పది మందికి మంచి చెప్పాల్సిన అధికారులే నిబంధనలు పాటించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.