News February 28, 2026

సదాశివపేట: ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. 14 మందికి గాయాలు

image

సదాశివపేట పట్టణ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు, లారీ పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో 14 మంది ప్రయాణికులకు గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సీఐ వెంకటేశం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 3, 2026

నాటుసారాను పూర్తి స్థాయిలో నివారించాలి: కలెక్టర్

image

నాటుసారా విక్రయదారుల కుటుంబాల జీవనోపాధికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జి.రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఏ కేటగిరీలో 19 గ్రామాలు, బీ కేటగిరీలో 19 గ్రామాలు, సీ కేటగిరిలో 91 గ్రామాలలో నాటు సారాను పూర్తి స్థాయిలో నివారించడానికి, ప్రత్యామ్నాయ ఉపాధి వైపు మారడానికి కృషి చేయాలన్నారు.

News March 3, 2026

అచ్చంపేట: ఇంటి ముందు క్షుద్రపూజల కలకలం

image

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని సాయి నగర్ కాలనిలోని ఒక ఇంటి ముందు క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గుర్తుతెలియని దుండగులు పూజలు చేసి ఒక ఇంటి ముందు మెట్లపై పాము బొమ్మ, పసుపు కుంకుమ, బియ్యం, నిమ్మకాయలు, కోడి కట్టి వేశారు. గమనించిన కుటుంబ సభ్యులు, కాలనీవాసులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు.

News March 3, 2026

సాయుధుల ఊచకోత.. 169 మంది మృతి

image

దక్షిణ సూడాన్‌లోని ఓ గ్రామంలో సాయుధులు జరిపిన దాడిలో 169 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతర్యుద్ధంలో భాగంగా ప్రతిపక్ష నేత రీక్ మచర్‌ మద్దతుదార్లు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. 90 మంది సాధారణ పౌరులు చనిపోయారని.. మృతుల్లో పిల్లలు, మహిళలు ఉన్నట్లు UN మిషన్ వెల్లడించింది. ఈ దాడి తర్వాత వెయ్యి మంది తమను ఆశ్రయించినట్లు తెలిపింది. చర్చల ద్వారా ప్రెసిడెంట్, ప్రతిపక్ష నేతలు సంధి కుదుర్చుకోవాలని కోరింది.