News February 28, 2026

రేపు ఖమ్మంకు నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యుడి రాక

image

నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ ఆదివారం ఖమ్మంలో పర్యటించనున్నట్లు జిల్లా బీజేపీ నాయకుడు జాటోత్ మధునాయక్ తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా సా.3 గంటలకు ఎస్టీ కమిషన్ సభ్యుడు వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులను పరామర్శిస్తారని చెప్పారు. అనంతరం భూదాన్ భూముల్లో కూల్చివేసిన ఇళ్లను పరిశీలిస్తారని అన్నారు. ఈ విషయాన్ని అధికారులు, ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.

Similar News

News March 2, 2026

‘PM సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి’

image

పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులతో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, 99 రోజుల ప్రజాపాలన ప్రగతి పాలన కార్యాచరణపై సమీక్షించారు. సోలార్ ప్యానెల్ అవసరమైన వారు www.pmsuryaghar.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News March 2, 2026

పరీక్షలంటే భయం వద్దు: కలెక్టర్

image

పదో తరగతి విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా, ప్రశాంత చిత్తంతో పరీక్షలకు సిద్ధం కావాలని కలెక్టర్ అనుదీప్ పిలుపునిచ్చారు. సోమవారం ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక మోటివేషన్ కార్యక్రమంలో మాట్లాడారు.పరీక్షల పట్ల భయం పెంచుకుంటే ఉన్న సమయాన్ని వృథా చేసుకోవడమే కాకుండా, తెలిసిన విషయాలను కూడా మర్చిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

News March 2, 2026

ఖమ్మం: బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్

image

గర్భాశయ క్యాన్సర్ నివారణకు 14-15 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఖమ్మం జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. మార్చి 4న జీజీహెచ్‌లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. జిల్లాలో 14 వేల మంది బాలికలను గుర్తించి, 7 ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు వేయనున్నారు. మార్కెట్‌లో రూ.3,500 విలువ చేసే ఈ టీకాను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.