News February 28, 2026

ఏలూరు: జిల్లా అధికారులతో ఎస్పీ సమీక్ష

image

ఏలూరు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, పెండింగ్‌‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారంపై ఎస్పీ ప్రతాప్ కిషోర్ శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తీవ్రమైన నేరాలు, మహిళలు, చిన్నారులపై జరిగిన దాడుల కేసుల్లో విచారణ ఏ దశలో ఉందో అడిగి తెలుసుకున్నారు. దర్యాప్తు పూర్తయిన కేసుల్లో వెంటనే ఛార్జ్ షీట్లను సిద్ధం చేసి, సంబంధిత న్యాయ స్థానాల్లో నిర్ణీత కాలవ్యవధిలో ఫైల్ చేయాలని స్పష్టం చేశారు.

Similar News

News March 1, 2026

తీవ్రమైన యుద్ధం.. అమెరికాకు ఇరాన్ షాక్!

image

ఖమేనీ మరణం తర్వాత పశ్చిమాసియా యుద్ధం తీవ్రమవుతోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిలిటరీ స్థావరాలపై ఇరాన్ దాడులను పెంచింది. కువైట్‌లోని US నావల్ బేస్‌పై 4 బాలిస్టిక్ మిస్సైళ్లు, 12 డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్ తెలిపింది. దీంతో ఆ షిప్ పూర్తిగా దెబ్బతిందని, భారీగా అమెరికా సైనికులు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అటు UAEలోని అమెరికా MSP క్లాస్ షిప్‌పై 4 డ్రోన్లతో దాడి చేసినట్లు సమాచారం.

News March 1, 2026

రేపు PGRS, రెవిన్యూ క్లినిక్: కలెక్టర్ కీర్తి

image

రాజమండ్రి కలెక్టరేట్లో సోమవారం PGRS, రెవెన్యూ క్లినిక్‌లను యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ప్రకటించారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి తదితర వివరాలకు 1100కు కాల్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు.

News March 1, 2026

మహబూబ్ నగర్: జిల్లా వ్యాప్తంగా ’30 పోలీస్ యాక్ట్’ అమలు

image

శాంతిభద్రతల పరిరక్షణ కోసం మహబూబ్ నగర్ జిల్లాలో మార్చి 1 నుంచి 30 వరకు 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ డి.జానకి తెలిపారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, బహిరంగ సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.