News May 4, 2024
HYDలో రేవంత్ రెడ్డి VS KTR

HYD, ఉమ్మడి RRలోని మల్కాజిగిరి, HYD, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి, BRS నాయకులతో మాజీ మంత్రి KTR మాట్లాడుతున్నారు. ఈ 9 రోజుల్లో నగరంలో చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాలపై సూచనలు చేస్తూనే ఎవరికి వారు గెలుపుపై వ్యూహాలు రచిస్తున్నారు. ఈ మేరకు రోడ్ షోలతో హోరెతిస్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో రాజకీయం వేడెక్కింది.
Similar News
News March 12, 2026
HYD: ఇది సంక్షోభం కాదు.. ప్రమాదం!

HYDలో పైపుల లీకేజీ సమస్యతో సంక్షోభం కాదు, భూగర్భ జలాలు వేగంగా పడిపోవడమే ప్రమాదం. పాతబస్తీ, ఖైరతాబాద్, అమీర్‌పేట్‌లో భూగర్భ జలాలు గతంతో పోలిస్తే 2.5మీటర్లకు పడిపోయాయి. భారీ నిర్మాణాలు, కాంక్రీటు జంగిల్‌గా మారుతున్న నగరంలో వర్షపు నీరు భూమిలోకి ఇంకడం లేదు. ఇంకుడు గుంతలు తప్పనిసరి అని చెబుతున్నా, పాత భవనాల్లో వీటి అమలు సున్నా. వేసవిలో ట్యాంకర్ల వ్యాపారం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
News March 12, 2026
HYD: ఆస్తి పన్ను వడ్డీపై 90% రాయితీ

పాత ఆస్తి పన్ను బకాయిలు ఉన్న నగరవాసులకు జీహెచ్‌ఎంసీ భారీ ఊరటనిస్తూ OTS పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద పన్ను బకాయిలపై ఉన్న వడ్డీలో 90 శాతం రాయితీ కల్పిస్తున్నారు. ఈ అవకాశాన్ని కేవలం మార్చి 31వ తేదీలోపు పన్ను చెల్లించిన వారు మాత్రమే పొందగలరని అధికారులు స్పష్టం చేశారు. ఆసక్తి గల వారు జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్, MyGHMC యాప్, మీసేవ కేంద్రాల ద్వారా తమ బకాయిలను చెల్లించవచ్చు.
SHARE IT
News March 12, 2026
ఇదే కొనసాగితే హైదరాబాద్‌లో బంద్!

నగరాన్ని గ్యాస్ కొరత కలవరపెడుతోంది. CNG స్టేషన్ల వద్ద బారులు తీరిన ఆటోలు, చర్లపల్లి గ్యాస్ ప్లాంట్ వద్ద నిలిచిన లారీలు, పలు రెస్టారెంట్లు, హోటళ్లలో ఖాళీ కుర్చీలు, స్టోర్‌లలో నిండుకుంటున్న ఇండక్షన్ స్టౌవ్‌లు, ప్రజల ముఖంలో దిగులు ఇవి HYDలో కనపడుతున్న దృశ్యాలు. గ్యాస్ సరఫరాలో ఇబ్బంది కొనసాగితే ‘HYD బంద్’ అయ్యి జనజీవనం స్తంభించడం, కడుపుమండటం, ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


