News May 4, 2024

హామీలను స్టాప్ పేపర్‌పై రాసిచ్చిన MLA అభ్యర్థి

image

ఎన్నికల మేనిఫెస్టోను స్టాంప్ పేపర్‌పై రాసి ఇచ్చి ఎన్నికల హామీలు నెరవేర్చకపోతే కోర్టుకు వెళ్లవచ్చని భారత్ నేషనల్ పార్టీ తరఫున రాజమండ్రి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తున్న కృష్ణ చైతన్య ప్రకటించారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలు కోర్టుకు వెళ్లవచ్చునని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అభివృద్ధి కుంటుపడిందని అన్నారు.

Similar News

News November 7, 2025

‘వందేమాతరం గీతం’ వార్షికోత్సవం నిర్వహించాలి: కలెక్టర్

image

దేశభక్తి గీతం వందేమాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈనెల 7న జిల్లా వ్యాప్తంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆర్టీ నంబర్ 2025 ప్రకారం, జిల్లా వ్యాప్తంగా అన్ని డివిజన్, మండల, గ్రామ స్థాయిల్లో ఒకే సమయంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఆమె అధికారులకు సూచనలు జారీ చేశారు.

News November 7, 2025

రిజర్వ్ ఫారెస్ట్‌లో నగర వనం: డీఎఫ్‌వో

image

జాతీయ రహదారిని ఆనుకుని దివాన్ చెరువు‌లోని రిజర్వ్ ఫారెస్ట్ లో 125 ఎకరాల విస్తీర్ణంలో రూ.రెండు కోట్లు వ్యయంతో నగరవనాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంతో హైదరాబాద్ నుంచి వచ్చిన ఆర్కిటెక్ట్ గౌరీ శంకర్‌తో కలిసి ఫారెస్ట్ డీఎఫ్ఓ ప్రభాకరరావు గురువారం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. వచ్చే పుష్కరాలు నాటికి ఇది సిద్ధమవుతుందని డీఎఫ్ఓ తెలిపారు.

News November 7, 2025

నిడదవోలు: పీఎంజేవై‌లో 757 ఇల్లు మంజూరు

image

జిల్లాలో పీఎం ఆవాస్ యోజన పథకం కింద పట్టణ ప్రాంత వాసులకు 757 గృహాలు మంజూరైనట్లు జిల్లా గృహ నిర్మాణ శాఖాధికారి ఎం. బుజ్జి తెలిపారు. ఆమె గురువారం నిడదవోలు మండలంలో క్షేత్రస్థాయిలో ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. పీఎంఏవై పథకం కొత్త మార్గదర్శకాలు విడుదలైనట్లు ఆమె పేర్కొన్నారు. నిడదవోలు, కొవ్వూరు మున్సిపాలిటీలతో పాటు రాజమహేంద్రవరం నగర కార్పొరేషన్ పరిధిలోని లబ్ధిదారులకు ఈ గృహాలు అందుతాయని వెల్లడించారు.