News February 28, 2026

KNR: పసిప్రాణాల ఇంజక్షన్ విలువ రూ.32 కోట్లు

image

టీం ఫంకీ జోన్ అనే పేరుతో కరీంనగర్ కు చెందిన యువకులు పసిపిల్లల ప్రాణాలు కాపాడడానికి ఈరోజు వేములవాడలో ఫండ్స్ కలెక్ట్ చేశారు. బెల్లంపల్లికి చెందిన శివ, సహస్ర పిల్లలకు (SMA) వ్యాధి వచ్చింది. వీరి ప్రాణాలు కాపాడాలంటే రెండు ఇంజక్షన్లకు రూ.32 కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు. వీరి ప్రాణాలను నిలబెట్టడానికి ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నామని, ఇప్పటివరకు రూ.30 లక్షలకు కలెక్ట్ చేసినట్లు తెలిపారు.

Similar News

News March 4, 2026

రూ.246కోట్ల ప్రమాద బీమా, లోన్ బీమా చెల్లింపు : సీతక్క

image

రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.246కోట్ల ప్రమాద బీమా, లోన్ బీమా మొత్తాన్ని చెల్లింపు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. మహిళా సంఘం సభ్యురాలు ప్రమాదంలో మరణిస్తే రూ.10లక్షలు, బ్యాంకులలో తీసుకున్న రుణాలలో గరిష్టంగా రూ.2లక్షల వరకు బీమా కవరేజీ ఇస్తున్నట్లు చెప్పారు. 2024నుంచి ఇప్పటి వరకు ప్రమాద బీమా కింద రూ.23.1కోట్లు, లోన్ బీమా కింద రూ.223.7కోట్లు చెల్లించిందని మంత్రి వెల్లడించారు.

News March 4, 2026

పాలమూరు:జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

✔ఘనంగా హోలీ వేడుకలు
✔తుమ్మన్‌పేటతో విడదీయలేని అనుబంధం: హీరో విజయ్‌ దేవరకొండ
✔జాగ్రత్త..అసత్య ప్రచారాలపై చర్యలు:SP
✔పాలమూరు: డ్రంక్ అండ్ డ్రైవ్.. 5 మంది డ్రైవర్లకు జైలు శిక్ష
✔జడ్చర్ల: మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన.. బాధ్యులపై సస్పెన్షన్ వేటు
✔పాలమూరు: రేపటి నుంచే ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు
✔శరవేగంగా మహబూబ్‌నగర్ – దేవరకద్ర రైల్వే పనులు
✔చంద్రగ్రహణం.. ఆలయాలు మూసివేత

News March 4, 2026

హోసన్నా మినిస్ట్రీస్ సభలకు రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు

image

గుంటూరులో నిర్వహించనున్న హోసన్నా మినిస్ట్రీస్ సభలకు రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. విజయవాడ మీదుగా ప్రయాణించే నం.17258/17257 కాకినాడ పోర్ట్- VJA, నం.67229/67230 VJA- గుంటూరు రైళ్లను ఈ నెల 5, 8న 18 చైర్ కార్ కోచ్‌లతో నడుపుతామని తెలిపింది. ఆయా తేదీలలో ప్రయాణికుల రద్దీ మేరకు ఒక ట్రిప్‌ను 8 కోచ్‌ల మెము రైళ్లకు బదులు 18 చైర్ కార్ కోచ్‌లతో నడుపనున్నట్లు పేర్కొంది.