News May 4, 2024
12 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి

ముంబైతో మ్యాచులో విజయం KKRకు ప్రత్యేకంగా నిలిచిపోయింది. 12 ఏళ్ల తర్వాత వాంఖడే వేదికగా ముంబైపై కోల్‌కతా విజయం సాధించడం గమనార్హం. చివరిసారిగా వాంఖడేలో ముంబైపై 2012లో గెలుపొందింది. ఓవరాల్‌గా వాంఖడే వేదికగా ఇరు జట్ల మధ్య 11 మ్యాచులు జరగ్గా KKR 9 మ్యాచుల్లో ఓడిపోగా, 2 మ్యాచుల్లో గెలుపొందింది.
Similar News
News March 22, 2026
రేపు విశాఖ రానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల 23న విశాఖ రానున్నారు. 23న మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని అక్కడి నుంచి నక్కపల్లి మండలం చందనాడ గ్రామానికి వెళ్తారు. చందనాడలో జరిగే స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు విశాఖ నుంచి విజయవాడ బయలుదేరి వెళ్తారు.
News March 22, 2026
PPPలది సక్సెస్ ఫార్ములా: చంద్రబాబు

AP: దేశంలో పీపీపీ విధానంలో చేపట్టిన గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డు, ఎయిర్ పోర్టులు విజయవంతం అయ్యాయని సీఎం చంద్రబాబు అన్నారు. క్వాంటం, ఏఐ, డ్రోన్స్ లాంటి భవిష్యత్ టెక్నాలజీలతో రాష్ట్రంలో సుపరిపాలన అందించేలా ప్రణాళికలు రచిస్తున్నామని HYD ISBలో తెలిపారు. వివిధ దేశాల్లో వయోవృద్ధుల సంఖ్య పెరుగుతోందని.. భారత్‌లో ఫెర్టిలిటీ రేటు పెరిగేలా చర్యలు చేపట్టాల్సి ఉందని వ్యాఖ్యానించారు.
News March 22, 2026
అస్సాం.. ఏ కూటమిలో ఏ పార్టీ?

అస్సాం ఎన్నికల్లో హాట్రిక్ కొట్టాలని BJP, అధికారమే లక్ష్యంగా INC హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈసారి AGP, UPPL, BPF పార్టీలతో కలిసి బీజేపీ, CPM, AJP, APHLCలతో కలిసి కాంగ్రెస్ బరిలో దిగుతున్నాయి. గత ఎన్నికల్లో ఏకంగా 16 సీట్లు గెలుచుకున్న AIUDF ఒంటరిగా బరిలో దిగుతోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని సీఎం హిమంత, పదేళ్ల పాలనకు ముగింపు పలుకుతామని గౌరవ్ గొగొయ్ ధీమాగా ఉన్నారు.
<<-se>>#Elections2026<<>>


