News February 28, 2026

భద్రాచలం: నవమి వేడుకలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి!

image

భద్రాచలంలో మార్చి 27, 28 తేదీల్లో జరగనున్న శ్రీరామనవమి కళ్యాణం, మహా పట్టాభిషేక ఉత్సవాలకు పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

Similar News

News March 3, 2026

పాలమూరు: ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తుండగా ప్రమాదం

image

జడ్చర్ల మండలం తుప్పడగడ్డతండాలో విషాదం చోటుచేసుకుంది. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఇసుక తెస్తున్న రాజేష్ (29) ట్రాక్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. వాగు నుంచి ఇసుకను తరలిస్తుండగా ట్రాక్టర్ ఒక్కసారిగా గుంతలోకి దిగడంతో రాజేష్ అదుపుతప్పి కింద పడటంతో దూసుకెళ్లింది. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 3, 2026

తమ్మినేనిపై సీపీఎం అభిశంసన

image

TG: CPM సీనియర్ నేత తమ్మినేని వీరభద్రాన్ని పార్టీ కేంద్ర కమిటీ అభిశంసింది. ఆయన రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సమయంలో లాబీయింగ్, ప్రలోభాలు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారంది. ఇది రాష్ట్ర కమిటీ నిట్టనిలువునా చీలడానికి దారితీసిందని ఆగ్రహించింది. తమ్మినేనితో పాటు కమిటీ సభ్యులు స్కైలాబ్ బాబు, ప్రసాద్‌ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని, వారిచ్చిన వివరణల్లోనూ ఆత్మవిమర్శ లోపించిందంటూ అభిశంసన చర్యలు చేపట్టింది.

News March 3, 2026

ఈ ప్రధాన పంటలకు ఈ ఎర పంటలతో మేలు

image

☛ వరి చుట్టూ జీలుగ వేసి కాండం తొలిచే పురుగు ఉద్ధృతి తగ్గించవచ్చు. ☛ మొక్కజొన్న చుట్టూ జొన్న మొక్కలను నాటి మొవ్వు ఈగ, కాండం తొలిచే పురుగును కట్టడి చేయొచ్చు. ☛ చెరకు పంట చుట్టూ కుంకుమ బంతి, సోయా చిక్కుడు వేసి నులి పురుగులను నివారించవచ్చు. ☛ పొగాకు చుట్టూ ఆముదం పంట వేసి పొగాకు లద్దె పురుగులను నియంత్రించవచ్చు. ☛ మిరప చుట్టూ ఆముదం పంట వేసి కాయతొలుచు పురుగులను కట్టడి చేయొచ్చు.