News February 28, 2026

కాకినాడ రానున్న డిప్యూటీ CM పవన్ కళ్యాణ్

image

సామర్లకోట మండలం వేట్లపాలెం బాణసంచా ప్రమాద బాధితులను పరామర్శించేందుకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం రాత్రి కాకినాడ చేరుకోనున్నారు. ముందుగా మృతదేహాలను పరిశీలించిన అనంతరం ఆయన కాకినాడలోని ప్రైవేట్ హోటల్‌లో బస చేస్తారు. ఆదివారం ఉదయం కాకినాడ GGHలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారికి భరోసా ఇవ్వనున్నారు. డిప్యూటీ CM పర్యటన కోసం అధికారులు పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News

News March 4, 2026

రాజమండ్రి: అపార్ట్‌మెంట్‌లో వివాహిత ఆత్మహత్య

image

రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు పరిధిలోని హుగ్గం పేటలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గోల్డెన్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న GVK Signature 202 అపార్ట్‌మెంట్‌లో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేధింపులు, అనుమానమే ఈ ప్రాణం తీసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 4, 2026

పంచాయతీల్లో ‘పంచాయితీ’!

image

TG: 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీల్లో చిచ్చు పెట్టాయి. ప్రతి ఊరికి రూ.6లక్షలు జమ కాగా వీటిని పాత బిల్లుల చెల్లింపులకూ వాడాలని పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో గతంలో తాము ఖర్చు చేసిన బకాయిలు చెల్లించాలని పాత సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ నిధులను కొత్త పనులకే వెచ్చిస్తామని నూతనంగా ఎన్నికైన సర్పంచులు చెబుతున్నారు. దీంతో గ్రామాల్లో నిత్యం గొడవలే జరుగుతున్నాయి.

News March 4, 2026

విజయవాడ IAS భార్య మృతి అప్డేట్ ఇదే..!

image

సీనియర్ IAS అధికారి GC కిషోర్ కుమార్ భార్య సత్య దీపిక మృతి అనుమానాస్పదం కాదని సహజ మరణమేనని ధ్రువీకరిస్తూ కేసును క్లోజ్ చేశారు. 2026 జనవరి 4న సత్య దీపిక మృతి చెందారు. పోస్టుమార్టం నివేదిక, ఇతర దర్యాప్తు ఆధారంగా సత్యదీపిక మృతి అనుమానాస్పదం కాదని సహజ మరణమే అని తేల్చారు. దీంతో ఆయా శాఖలు ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసును అధికారికంగా మంగళవారం క్లోజ్ చేశారు.