News February 28, 2026
జగిత్యాల: మండల సర్పంచ్‌లకు సర్టిఫికెట్లు పంపిణీ

జగిత్యాల పట్టణంలోని నూకపల్లి నాక్ సెంటర్‌లో ఎండపల్లి, వెల్గటూర్, బుగారం, కొడిమ్యాల మండలాల సర్పంచ్‌లకు నిర్వహించిన ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు జరిగిన ఈ శిక్షణలో గ్రామాభివృద్ధి, పంచాయతీ పరిపాలన, నిధుల వినియోగం, ప్రభుత్వ పథకాల అమలుపై అవగాహన కల్పించారు. శిక్షణ అనంతరం ఆన్లైన్ టెస్ట్‌లు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు అందజేసినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News March 5, 2026
MBNR: బిడ్డను ఉయ్యాలలో వదిలి.. అనంతలోకాలకు

అప్పుల బాధ ఆ పసిగుడ్డుకు తల్లిని దూరం చేసింది.. తండ్రిని మృత్యువుతో పోరాడేలా చేసింది. జంగమయ్యపల్లిలో చోటుచేసుకున్న <<19307113>>దంపతుల ఆత్మహత్యాయత్నం<<>> స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అప్పులు తీర్చే మార్గం కనిపించక మురుగని దంపతులు తమ పొలంలో పసిబిడ్డను ఉయ్యాలలో వేసి, పక్కనే ఉన్న చెట్టుకు ఉరివేసుకున్నారు. చనిపోయే ముందు రవి తన తమ్ముడికి వీడియో కాల్ చేసి ‘మేము ఇక బతకలేం’ అని రోదించడం అందరినీ కలిచివేసింది.
News March 5, 2026
MBNR: ఆత్మహత్యాయత్నం.. భార్య మృతి, భర్త పరిస్థితి విషమం

నవాబుపేట(M) జంగమయ్యపల్లిలో అప్పుల ఊబిలో చిక్కుకున్న ఓ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన మురుగని రవి-లావణ్య దంపతులు తమ పొలంలో చెట్టుకు ఉరివేసుకున్నారు. చనిపోయే ముందు రవి HYDలోని తన తమ్ముడికి వీడియో కాల్ చేసి, తాము చనిపోతున్నామని తెలిపారు. ఈ ఘటనలో లావణ్య అక్కడికక్కడే మృతి చెందగా.. కొన ప్రాణంతో ఉన్న రవిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.
News March 5, 2026
విరోష్ జంటకు సీఎం శుభాకాంక్షలు

TG: సీఎం రేవంత్ రెడ్డి నూతన దంపతులు రష్మిక-విజయ్ దేవరకొండను ఆశీర్వదించారు. రిసెప్షన్ సమయంలో ఢిల్లీలో ఉన్న సీఎం.. ఇవాళ విజయ్ నివాసానికి వెళ్లారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి ఫ్యామిలీతో కలిసి ఫొటో దిగారు.


