News February 28, 2026

కరీంనగర్: ఎలక్ట్రిక్ వాటర్ వీల్స్ అందజేసిన కేంద్ర మంత్రి

image

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ చైర్మన్ మనోజ్ కుమార్ శనివారం హైదరాబాదులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కుమ్మరి వృత్తి శిక్షణ పొందిన వారికి ఎలక్ట్రిక్ పాటర్ వీల్స్ అందజేశారు. ‘గ్రామోద్యోగ వికాస్ యోజన’ పథకంలో భాగంగా గ్రామీణ చేతి వృత్తులను ప్రోత్సహించడానికి వీలుగా అధునాతన పనిముట్లు అందజేస్తున్నట్లు వారు తెలిపారు. సంబంధిత శాఖ ఉద్యోగులు, వృత్తి కళాకారులు పాల్గొన్నారు.

Similar News

News March 1, 2026

ఈ నెల 4న ‘విరోష్’ రిసెప్షన్.. వారికే అనుమతి!

image

విజయ్ దేవరకొండ, రష్మిక రిసెప్షన్ ఈ నెల 4న HYDలో జరగనుంది. వాలిడ్ ఇన్విటేషన్ ఉన్నవారినే అనుమతించనున్నట్లు ‘విరోష్’ జోడి ఓ స్టేట్‌మెంట్‌ రిలీజ్ చేసింది. ‘భద్రతా కారణాల దృష్ట్యా పోలీసుల సూచనతో గెస్ట్ లిస్ట్‌ను కుదించాం. దయచేసి ఇన్విటేషన్ లేని వారు ఈవెంట్ ప్లేస్‌కి రావొద్దు. ఎలాంటి అంతరాయం లేకుండా రిసెప్షన్ జరిగేందుకు సహకరించండి’ అని కోరింది. కాగా ఈరోజు CM రేవంత్‌ను రష్మిక రిసెప్షన్‌కు ఆహ్వానించారు.

News March 1, 2026

తెలంగాణ పోలీసుశాఖకు దేశంలోనే మంచి పేరుంది: DGP

image

తెలంగాణ పోలీసుశాఖకు దేశంలోనే మంచి పేరుందని, ఇతర రాష్ట్రాలతో పోల్చితే నేరాల నియంత్రణలోనూ సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలోనూ ముందు వరుసలో ఉన్నామని DGP శివధర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఖమ్మం సీపీ సునీల్ దత్ ఆధ్వర్యంలో పోలీస్ శిక్షణ కేంద్రంలో పోలీసు అధికారులతో నేర సమీక్ష నిర్వహించారు. మహిళలు, సైబర్ నేరాల, రోడ్డు ప్రమాదాలు, మాదకద్రవ్యాల నియంత్రణ, ఇసుక అక్రమ రవాణా తదితర అంశాలపై విస్తృత సమీక్ష చేపట్టారు.

News March 1, 2026

నివారణాత్మక పోలీసింగ్‌పై దృష్టి: తెలంగాణ డీజీపీ

image

నివారణాత్మక పోలీసింగ్‌పై దృష్టి సారించాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. ఖమ్మం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్మించిన పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అదే విధంగా అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన పోలీస్ గృహ భవనాలను మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి డీజీపీ ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్.. పోలీస్ సిబ్బంది, పోలీస్ పిల్లలను ఉత్తమ క్రీడాకారులను చేయడమే లక్ష్యంగా నిర్మితమైతుందన్నారు.