News February 28, 2026

ఏలూరు: ‘అసలు కట్టి.. వడ్డీ పట్టు’

image

ఉమ్మడి ప.గో వ్యాప్తంగా 465 మంది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం పొంది బకాయి ఉన్న అసలు రూ.13.55 కోట్లను చెల్లిస్తే వడ్డీ మాఫీ అవుతుందని ఈఈ ముక్కంటి శనివారం తెలిపారు. ఈ సొమ్ముకు వడ్డి రూ.1.66 కోట్లు ఉందన్నారు. ఏప్రిల్ 30 లోపు అసలు కడితే, వడ్డీ మాఫీ అవుతుందని స్పష్టం చేశారు. ద్వారకా తిరుమల (M) జీ.కొతపల్లి గ్రామానికి చెందిన జొన్నకూటి వెంకటేశ్వర రావు తీసుకున్న నగదు పూర్తిగా చెల్లించడంతో సత్కరించారు.

Similar News

News March 2, 2026

ఖమ్మం: బంగ్లాదేశ్ నుంచి నకిలీ సిగరెట్ల హవాలా

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నకిలీ సిగరెట్ల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. బంగ్లాదేశ్ నుంచి హవాలా మార్గంలో వీటిని దిగుమతి చేస్తూ, ఖమ్మం నుంచి భద్రాచలం వరకు భారీ నెట్‌వర్క్‌ను నడుపుతున్నారు. అధిక మత్తు కోసం కెమికల్స్ వాడుతుండటంతో వినియోగదారులు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. అధికారులు నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారని, కోట్ల రూపాయల ఈ అక్రమ దందాను అరికట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

News March 2, 2026

విశాఖ: నకిలీ పత్రాలతో బురిడీ.. రూ.28 లక్షలు కాజేశాడు

image

పెందుర్తిలో రియల్ ఎస్టేట్ పేరుతో భారీ మోసానికి పాల్పడిన ఒడిశాకి చెందిన నిందితుడు నబీనా బాఘాను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడు ప్రసాద్ బాబుకు నకిలీ పత్రాలతో స్థలం అమ్ముతామని నమ్మించి రూ.28 లక్షలు కాజేశారు. ఇన్‌స్పెక్టర్ ‌సతీష్ కుమార్ సూచనలతో SI భాస్కరరావు బృందం నిందితుడిని పట్టుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఆదివారం తెలిపారు. రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

News March 2, 2026

VZM: పశు మాంసం విక్రయిస్తున్న వారిని అరెస్ట్ చేసిన పోలీసులు

image

ఎస్.కోట మండలం గోపాలపల్లి SC కాలనీ వద్ద పశు మాంసాన్ని విక్రయిస్తున్న షేక్ బాషా, సుల్తాన్ అనే వ్యక్తులను ఆదివారం ఎస్.కోట పోలీసులు అరెస్టు చేశారు. గొర్రెలు పెంపకం పేరుతో షెడ్డు వేసుకొని, పశువులను వధించి వాటి మాంసాన్ని విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి వారి నుంచి మాంసాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని CI నారాయణమూర్తి తెలిపారు.