News February 28, 2026
ఏలూరు: ‘సెకండ్ ఇంటర్ పరీక్షకు 5,791 మంది హాజరు’

ఏలూరు జిల్లాలో శనివారం నిర్వహించిన ఇంటర్ సెంకడ్ ఇయర్బో టనీ పరీక్షకు మొత్తం 6,828 మంది విద్యార్థులకు గానూ 5,791 మంది హాజరయ్యారని ఆర్ఐవో యోహాన్ తెలిపారు. 55 సెంటర్లో జరిగిన ఈ పరీక్షలకు వివిధ కారణాల చేత 237 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జనరల్ విభాగంలో 3,916 మంది, ఒకేషనల్ విభాగంలో 1,875 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు ఆయన వివరించారు.
Similar News
News March 11, 2026
BHPL: గుండె పోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

గుండె పోటుతో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగింది. హెడ్ క్వార్టర్స్‌లో డ్యూటీ నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ విజయ్ బాబు(60) బుధవారం గుండెపోటుకు గురయ్యారు. మరణం పట్ల జిల్లా ఎస్పీ సంకీర్త్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్‌తో కలిసి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
News March 11, 2026
మోదీ పాలనలో క్యూలే మిగిలాయి: కాంగ్రెస్

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. మోదీ హయాంలో దేశ ప్రజలు నిరంతరం లైన్లలోనే గడపాల్సి వస్తోందంటూ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో 2016 నోట్ల రద్దు సమయంలో ATMల వద్ద పడ్డ కష్టాలు, కరోనా సెకండ్ వేవ్ వేళ ఆక్సిజన్ కోసం, ప్రస్తుతం వంట గ్యాస్ (LPG) కోసం క్యూ కట్టడాన్ని ఎత్తిచూపింది. మోదీ పాలనలో కేవలం క్యూలే మిగిలాయని సెటైరికల్ ట్వీట్ చేసింది.
News March 11, 2026
రేపు కనిగిరిలో జాబ్ మేళా..!

కనిగిరిలోని అమరావతి గ్రౌండ్‌లో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఉగ్ర బుధవారం తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ ,బీ.టెక్, తదితర కోర్సులు చదివిన నిరుద్యోగులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. 18 నుంచి 26 సంవత్సరాల లోపు వారు ఆధార్ కార్డు, టీసీ, మార్క్ లిస్ట్, 2 పాస్ ఫోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరుకావాలని సూచించారు.


