News March 1, 2026

రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం: కర్నూలు SP

image

రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని శనివారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లాలో జనవరి 1 నుంచి ఫిబ్రవరి 27 వరకు ఓవర్ స్పీడ్ (1,536), హెల్మెట్ లేకుండా (1,388), సెల్‌ఫోన్ డ్రైవింగ్ (392), ట్రిపుల్ రైడింగ్ (63) కేసులపై ఈ-చలాన్లు నమోదు చేశారు. అదనంగా 548 డ్రంకెన్ డ్రైవింగ్, 1,107 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేసినట్లు వివరించారు.

Similar News

News March 5, 2026

కర్నూలు: 395 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

image

పత్తికొండ శ్రీ వైష్ణవి డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఆనంద్ రాజ్ కుమార్, ప్రిన్సిపల్ రాజశేఖర్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో వివిధ కంపెనీలలో 395 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఫార్మసీ చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని తెలిపారు.

News March 5, 2026

కర్నూలులో రికార్డు ధర

image

కర్నూలు జిల్లా మిర్చి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం బ్యాడిగ మిర్చి క్వింటా రూ.38,508 గరిష్ఠ ధర పలికింది. ఈ సీజన్‌లో ఇదే రికార్డు ధర కావడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. సూపర్-10 రకం రూ.21,600, మిర్చి-5 రకం రూ.21,229, దేవనూరు డీలక్స్ రకం రూ.20,199, తేజ రకం రూ.19,600కు కొనుగోలు చేసినట్లు వ్యాపారులు తెలిపారు.

News March 5, 2026

నంద్యాల: WOW.. 106 ఏళ్ల వయసులోనూ..!

image

నేటి కల్తీ ఆహారపు విషవలయంలో మానవుడి సగటు ఆయువు 70 ఏళ్లకే పరిమితమవుతుంటే, నంద్యాల(D) పాములపాడు మండలం చెలిమిళ్లకు చెందిన లక్ష్మమ్మ 106 ఏళ్లు పూర్తి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ వయసులోనూ ఆమె చూపు మందగించకపోవడం, తన పనులు తానే చేసుకోవడం విశేషం. ఆ రోజుల్లో తీసుకున్న రాగి సంగటి, జొన్నరొట్టెలు, కొర్రలు, సజ్జలు వంటి ప్రకృతి సిద్ధమైన ఆహారం ఆమెను నేటికీ ఆరోగ్యంగా ఉంచాయని మేనల్లుడు ఏసన్న తెలిపారు.