News May 4, 2024

ఇవాళ సీఎం రేవంత్ ప్రచారం ఎక్కడంటే?

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూకుడు కొనసాగిస్తున్నారు. ఇవాళ ఆయన నాలుగు చోట్ల పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కొత్తగూడెం జనజాతర సభలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు కొత్తకోట కార్నర్ మీటింగ్, 6:30 గంటలకు సికింద్రాబాద్, రాత్రి 8 గంటలకు ముషీరాబాద్ కార్నర్ మీటింగ్‌లకు హాజరు కానున్నారు.

Similar News

News December 27, 2024

పెన్షన్ తీసుకునేవారికి అదిరిపోయే న్యూస్

image

AP: పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులకు ఒకరోజు ముందే పింఛన్లు అందించనుంది. సాధారణంగా ప్రతినెలా 1న వీటిని జారీ చేస్తుండగా ఈసారి జనవరి 1 కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31నే అందజేయాలంటూ తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. ఎన్టీఆర్ భరోసా కింద వృద్ధులు, వితంతువులకు రూ.4వేల పింఛన్ అందుతోంది.

News December 27, 2024

PET LOVERS.. మీ గుండె తరుక్కుపోవడం ఖాయం!

image

మనుషుల్లాగే కుక్కలు, పిల్లులనూ షుగర్ వ్యాధి వేధిస్తుందంటే ఆశ్చర్యపోకతప్పదు. వాటి బాధను చూడలేక, వైద్యానికి ఖర్చుచేయలేక ఇంజెక్షన్లు ఇచ్చి 20% జీవాల్ని చంపేస్తారని తెలిస్తే గుండెతరుక్కుపోవడం ఖాయం. వీటిలోనూ టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ ఉంటుందని, ఆకలి తగ్గిపోతుందని పరిశోధకులు అంటున్నారు. వాటి నడక, బరువు, ఉత్సాహం, కూర్చొనే తీరును బట్టి వ్యాధిని గుర్తించొచ్చు. సోడియం గ్లూకోజ్ వంటి ఔషధాలను వీటికి వాడతారు.

News December 27, 2024

HYDలో 2 లక్షల కండోమ్ ప్యాకెట్ల బుకింగ్స్!

image

ఈ ఏడాదికి సంబంధించిన ఆర్డర్స్ నివేదికను స్విగ్గీ మార్ట్ విడుదల చేసింది. హైదరాబాదీలు ఈ ఏడాది 2 కోట్ల చిప్స్ ప్యాకెట్లను ఆర్డర్ చేశారని, దాదాపు 2 లక్షల కండోమ్‌లను బుక్ చేసినట్లు పేర్కొంది. అత్యధికంగా ఆర్డర్ చేసిన వస్తువుల్లో పాలు, టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఉన్నట్లు తెలిపింది. నగర ప్రజలు కేవలం ఐస్‌క్రీమ్‌లకే దాదాపు ₹31 కోట్లు, బ్యూటీ ప్రొడక్ట్స్‌కు ₹15 కోట్లు ఖర్చు చేశారంది.