News March 1, 2026
MNCL: ‘రాయితీపై డ్రోన్ల కొరకు దరఖాస్తు చేసుకోవాలి’

మంచిర్యాల జిల్లాలో రాయితీపై డ్రోన్ల కొరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ తెలిపారు. 2025- 26 సంవత్సరానికి గాను జిల్లాకు 10 వ్యవసాయ డ్రోన్లను కేటాయించినట్లు పేర్కొన్నారు. కలెక్టర్ ఆదేశాలతో మంచిర్యాల డివిజన్ కు 3, చెన్నూర్ కు 3, బెల్లంపల్లికి 2, భీమినికి 2 డ్రోన్లు కేటాయించామన్నారు. తెలిపారు. ఈ డ్రోన్లను 40 శాతం (రూ.4 లక్షల) రాయితీపై అందించనునట్లు తెలిపారు.
Similar News
News March 4, 2026
ఇరాన్‌పై 3 డేంజరస్ బాంబర్లతో US దాడి

ఇరాన్‌పై అమెరికా 3 భారీ బాంబర్లను ఉపయోగించింది. అవి B-52 స్ట్రాటోఫోర్ట్రెస్, B-1 లాన్సర్, B-2 స్పిరిట్. B-52 స్ట్రాటోఫోర్ట్రెస్ 31వేల KGల బరువైన బాంబులను మోసుకెళ్తుంది. B-1 లాన్సర్ సూపర్‌సోనిక్, ఫాస్టెస్ట్ బాంబర్. ఇది 35వేల కేజీల బాంబులను శత్రు స్థావరాలపై వేస్తుంది. ఇక B-2 స్పిరిట్ మోస్ట్ డేంజరస్. రాడార్లకు చిక్కకుండా 50వేల అడుగుల ఎత్తుపై నుంచి బాంబులను వదులుతుంది. దీని ధర దాదాపు ₹20వేల కోట్లు.
News March 4, 2026
జాతీయ క్రికెట్‌లో కానిస్టేబుల్ సాయి సత్తా.. ఎస్పీ సన్మానం

జాతీయ స్థాయి క్రికెట్ క్రీడాకారుడు, కానిస్టేబుల్ సాయి కుమార్‌ను ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఘనంగా సన్మానించి నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఇటీవల తిరుపతిలో జరిగిన సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్‌లో సాయి అద్భుత ప్రదర్శనతో జట్టును సెమీ ఫైనల్‌కు చేర్చారు. క్రీడల్లో రాణిస్తూ పోలీస్ శాఖకు పేరు తెచ్చినందుకు ఎస్పీ ఆయనను అభినందించారు.
News March 4, 2026
ADB కలెక్టర్ క్యాంపు ఆఫీసులో హోలీ వేడుకలు

ఆదిలాబాద్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో కలెక్టర్ రాజర్షిషా అదనపు కలెక్టర్ రాజేశ్వర్ పాల్గొని ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ, హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎస్పీ కార్పొరేషన్ ఈడి మనోహర్, సంక్షేమ అధికారి మిల్కా, డిపిఓ రమేష్, డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్, మున్సిపల్ కమిషనర్ రాజు, మెప్మా పిడి రాజు ఉన్నారు.


