News March 1, 2026

బిచ్కుంద: 24 గంటల్లోనే హత్య కేసు నిందితుడి అరెస్ట్

image

భూ తగాదాల నేపథ్యంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. బిచ్కుంద CI రవి తెలిపిన వివరాలు.. బిచ్కుందకు చెందిన సాయిలు, అతని సోదరుడు నారాయణ మధ్య కొంతకాలంగా భూ వివాదాలు నడుస్తున్నాయి. ఆగ్రహానికి లోనైన నారాయణ సాయిలు తలపై కర్రతో బలంగా బాదాడు. తీవ్ర గాయాలైన సాయిలు అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు నారాయణను పట్టుకొని, హత్యకు వాడిన కర్రను స్వాధీనం చేసుకున్నట్లు CI వెల్లడించారు. SI రాజు ఉన్నారు.

Similar News

News March 1, 2026

హైదరాబాద్‌లో టీచింగ్ పోస్టులు

image

<>హైదరాబాద్‌లోని<<>> మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ 11 టీచింగ్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు మార్చి 18 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని మార్చి 27 వరకు పంపవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీజీ, MEd, PhD, NET/SET, MD, ME/MTech అర్హత సాధించి ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://manuu.edu.in

News March 1, 2026

ఆరోగ్యం కోసం ఏం మానేయాలంటే?

image

బాలార్కో ప్రేతధూమశ్చ వృద్ధా స్త్రీ పల్వలోదకమ్|
రాత్రౌ దధ్యన్నభుక్తిశ్చ ఆయుఃక్షీణం దినే దినే||
సూర్యోదయ సమయంలో వచ్చే ఎండ, శ్మశానంలోని దహన పొగ, వయసు మళ్లిన స్త్రీతో పొందు, నిల్వ ఉన్న మురికి గుంటలోని నీరు తాగడం, రాత్రి పెరుగన్నం తినడం మంచిది కాదు. దీనివల్ల ఆయుష్షు రోజురోజుకూ క్షీణిస్తుంది. రాత్రిపూట పెరుగుకు బదులుగా పాలు తీసుకోవచ్చు. పాలన్నం కూడా ఆరోగ్యకరమే. ఈ నియమాలను పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం.

News March 1, 2026

హోలీ.. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు

image

హోలీ పండుగ నేపథ్యంలో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లుగా సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ నుంచి నహరిగన్ సహా ఇతర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు చెప్పారు. Rail One యాప్ ద్వారా వీటికి సంబంధించిన వివరాలను చూసుకునే వెసులుబాటును కల్పించినట్లుగా తెలిపారు.