News March 1, 2026
ఖమేనీ చనిపోయారు: ట్రంప్

ఇరాన్ సుప్రీంలీడర్ అలీ ఖమేనీ చనిపోయినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఖమేనీని చరిత్రలోనే అత్యంత చెడ్డ వ్యక్తిగా పేర్కొన్నారు. ఈ చావుతో ఇరాన్ పౌరులతో పాటు అమెరికన్లు, బాధిత దేశాలకు న్యాయం జరిగిందన్నారు. తమ నిఘా నుంచి ఖమేనీ తప్పించుకోలేకపోయారని అన్నారు. ఇరాన్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అక్కడి పౌరులకు ఇది అతిపెద్ద అవకాశమన్న ట్రంప్.. దాడులు మరో వారం కొనసాగుతాయన్నారు.
Similar News
News March 3, 2026
BJP ఆగడాలను మనం అడ్డుకోవాలి: రాహుల్

TG: BJP ప్రజల మధ్య విభేదాలు సృష్టించి అధికారంలోకి రావాలని చూస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండి BJP ఆగడాలను అడ్డుకొని దేశాన్ని రక్షించాలని వికారాబాద్‌లో DCC అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. ‘చేయి గుర్తు అంటే అభయ ముద్ర. అన్ని మతాల చిహ్నం కూడా అభయ ముద్రనే. అదే మన సిద్ధాంతం. కాంగ్రెస్ అంటే శాంతి, అహింస, సత్య వాక్కు. వీటితోనే మనం ప్రజల్లోకి వెళ్లాలి’ అని సూచించారు.
News March 2, 2026
ప్రధాని పదవిపై తొలిసారి రాహుల్ సానుకూల సంకేతాలు!

TG: ప్రధానమంత్రి పదవి చేపట్టడంపై తొలిసారి రాహుల్ గాంధీ సానుకూల సంకేతాలు ఇచ్చారు. వికారాబాద్‌లో జరిగిన DCC అధ్యక్షుల శిక్షణ శిబిరంలో ‘ఈ దేశం కోసం రాహుల్ ప్రధాని కావాల్సిందే’ అని సీఎం రేవంత్ కోరారు. అందుకు స్పందించిన రాహుల్ ‘మోదీపై యుద్ధానికి సిద్ధం’ అని తల ఊపుతూ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి పదవి అలంకరణ కాదని, ఈ దేశ ప్రజలకు సేవ చేయడం కోసమేనని రేవంత్ తెలిపారు.
News March 2, 2026
భీకర దాడి జరగబోతోంది.. ప్రజలు బయటకు రావొద్దు: ట్రంప్

ఇరాన్‌కు ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ‘మా సైన్యం ఇరాన్ నుంచి చెత్తను తొలగిస్తోంది. మేమింకా భారీస్థాయిలో దాడి చేయలేదు. త్వరలో భీకర దాడి జరగబోతోంది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలి. బయట సేఫ్ కాదు. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగడం నాకూ ఇష్టం లేదు. 4 వారాల్లో ముగుస్తుందని భావిస్తున్నా. ఇరాన్ ప్రజలు తమ దేశంపై నియంత్రణ సాధించాల్సిందే. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడి చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది’ అని CNNతో తెలిపారు.


