News May 4, 2024
‘కన్నప్ప’కి బాలీవుడ్ నటుడు బై బై
‘కన్నప్ప’ మూవీలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన పాత్రకి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తైంది. ఈ క్రమంలో మూవీ టీమ్ ఆయనకు వీడ్కోలు పలికింది. అక్షయ్ నుంచి ఎంతో నేర్చుకున్నానని.. ఈ ప్రయాణం ఎంతో విలువైనదని హీరో మంచు విష్ణు అన్నారు. కాగా ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Similar News
News December 27, 2024
జియో యూజర్లకు బిగ్ షాక్
డైలీ డేటా అయిపోయినప్పుడు వినియోగించే రూ.19, రూ.29 డేటా వోచర్ల వ్యాలిడిటీని జియో తగ్గించింది. ఇప్పటివరకు ప్రస్తుత ప్లాన్ గడువు ముగిసేవరకు ఈ వోచర్ వ్యాలిడిటీ ఉండేది. కానీ రూ.19తో రీఛార్జ్ చేస్తే వచ్చే 1జీబీ డేటాను ఒకరోజుకు, రూ.29 రీఛార్జ్ డేటా 2జీబీని రెండురోజులకు పరిమితం చేసింది. ఇప్పటికే అమల్లోకి వచ్చిన ఈ నిర్ణయం యూజర్లకు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు.
News December 27, 2024
నా పిల్లలకు మన్మోహన్ స్కాలర్‌షిప్ ఇస్తానన్నారు: మలేషియా ప్రధాని
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో తనకున్న అనుబంధాన్ని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం నెమరేసుకున్నారు. ‘గతంలో నేను జైలుకు వెళ్లినప్పుడు సింగ్ అండగా నిలిచారు. మలేషియా ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసినా, నా పిల్లల చదువు కోసం స్కాలర్‌షిప్ చెల్లిస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆయన ప్రతిపాదనను నేను సున్నితంగా తిరస్కరించా’ అంటూ సింగ్ మరణవార్త తెలిసి Xలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
News December 27, 2024
కాలువలో పడిన బస్సు.. 8 మంది మృతి
పంజాబ్‌లోని బఠిండాలో ఓ బస్సు కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందారు. స్థానిక MLA జగ్పూర్ సింగ్ గిల్ తెలిపిన వివరాల మేరకు వంతెనపై రెయిలింగ్‌ను ఢీకొనడంతో బస్సు కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఆయన తెలిపారు. 18 మంది ప్రయాణికులు షాహిద్ భాయ్ మణిసింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.