News March 1, 2026

గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు

image

గుంటూరు దక్షిణ మధ్య రైల్వే హోలీ పండుగను పురస్కరించుకుని గుంటూరు మీదుగా శనివారం రాత్రి నుంచి మొదలవుతాయని ఒక ప్రకటనలో తెలియజేశారు. రైళ్ల వివరాలు 07097/07098 చర్లపల్లి – ధనాపూర్, 07998 మచిలీపట్నం – జగదల్పూర్,06233 /06234 యశ్వంత్ పూర్ – సత్ర గంజి,06021/06022 పోధనూర్ -బరౌని, ఈ రైళ్లు మార్చి 12వ తారీకు వరకు నడుస్తాయని తెలిపారు.

Similar News

News March 3, 2026

కడప జిల్లాలోని AMCల్లో ఉద్యోగుల ఖాళీలు ఎన్నంటే.!

image

కడప జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో <<19285111>>110 మంది<<>> దాకా ఉద్యోగుల కొరత ఉంది. కడపలో 41 మందికి గాను 9 మంది, ప్రొద్దుటూరులో 25 మందికి గాను 6, బద్వేల్‌లో 15 మందికి గాను 4, జమ్మలమడుగులో 10 మందికి గాను 4, రాజంపేటలో 8 మందికి గాను ముగ్గురు, మైదుకూరులో 12 మందికి గాను నలుగురు, కమలాపురంలో 8 మందికి గాను ఇద్దరు, ఎర్రగుంట్లలో 8 మందికి గాను ఇద్దరు, సింహాద్రిపురంలో 6 మందికి గాను ఇద్దరు మాత్రమే ఉద్యోగులు ఉన్నారు.

News March 3, 2026

KUలో పార్ట్ టైం పోస్టుల దరఖాస్తులకు రేపే లాస్ట్

image

కేయూలోని వివిధ విభాగాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పార్ట్ టైం బోధనా సిబ్బంది నియామక దరఖాస్తు గడువును పొడిగించినట్లు రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం తెలిపారు. ఫిబ్రవరి 28తో ముగియాల్సిన గడువును అభ్యర్థుల అభ్యర్థన మేరకు మార్చి 4 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు కేయూ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

News March 3, 2026

నల్గొండ: పరీక్షకు వెళ్తుండగా విషాదం.. విద్యార్థులు మృతి

image

నిన్న నల్గొండలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు విద్యార్థుల ప్రాణాలను బలితీసుకుంది. శాలిగౌరారం మండలానికి చెందిన వంశీ (20), రవి (20) ఇంటర్ పరీక్ష రాసేందుకు బైక్‌పై వెళ్తుండగా, స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. రూరల్ ఎస్సై సైదా బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.