News May 4, 2024
ఈ సీజన్‌లో ఇదే తొలి సారి
ముంబై, కోల్‌కతా మధ్య మ్యాచులో చెత్త ఫీట్ చోటు చేసుకుంది. ఒకే మ్యాచులో ఇరు జట్లు ఆలౌట్ అయ్యాయి. దీంతో ఈ సీజన్‌లో ఓకే మ్యాచులో రెండు టీమ్స్ ఆలౌటైన తొలి మ్యాచుగా నిలిచింది. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఇలా నాలుగు సార్లు జరిగింది. 2010లో DCvsRR, 2017లో KKRvsRCB, 2018లో MIvsSRH మ్యాచుల్లో రెండు జట్లు ఆలౌటయ్యాయి.
Similar News
News December 27, 2024
PET LOVERS.. మీ గుండె తరుక్కుపోవడం ఖాయం!
మనుషుల్లాగే కుక్కలు, పిల్లులనూ షుగర్ వ్యాధి వేధిస్తుందంటే ఆశ్చర్యపోకతప్పదు. వాటి బాధను చూడలేక, వైద్యానికి ఖర్చుచేయలేక ఇంజెక్షన్లు ఇచ్చి 20% జీవాల్ని చంపేస్తారని తెలిస్తే గుండెతరుక్కుపోవడం ఖాయం. వీటిలోనూ టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ ఉంటుందని, ఆకలి తగ్గిపోతుందని పరిశోధకులు అంటున్నారు. వాటి నడక, బరువు, ఉత్సాహం, కూర్చొనే తీరును బట్టి వ్యాధిని గుర్తించొచ్చు. సోడియం గ్లూకోజ్ వంటి ఔషధాలను వీటికి వాడతారు.
News December 27, 2024
HYDలో 2 లక్షల కండోమ్ ప్యాకెట్ల బుకింగ్స్!
ఈ ఏడాదికి సంబంధించిన ఆర్డర్స్ నివేదికను స్విగ్గీ మార్ట్ విడుదల చేసింది. హైదరాబాదీలు ఈ ఏడాది 2 కోట్ల చిప్స్ ప్యాకెట్లను ఆర్డర్ చేశారని, దాదాపు 2 లక్షల కండోమ్‌లను బుక్ చేసినట్లు పేర్కొంది. అత్యధికంగా ఆర్డర్ చేసిన వస్తువుల్లో పాలు, టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఉన్నట్లు తెలిపింది. నగర ప్రజలు కేవలం ఐస్‌క్రీమ్‌లకే దాదాపు ₹31 కోట్లు, బ్యూటీ ప్రొడక్ట్స్‌కు ₹15 కోట్లు ఖర్చు చేశారంది.
News December 27, 2024
YCPకి ఇంతియాజ్ రాజీనామా
AP: కర్నూలు జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. విశ్రాంత IAS అధికారి ఇంతియాజ్ అహ్మద్ వైసీపీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన టీజీ భరత్ చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి వైసీపీకి దూరంగా ఉంటున్న ఆయన తాజాగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఇకపై సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటానని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.