News March 1, 2026
GNT: ఏకాంత వీడియోలతో బ్లాక్ మెయిల్

వివాహిత పర్సనల్ వీడియోలు ఆమె భర్త, తండ్రికి పంపించి బెదిరిస్తున్న మాజీ ప్రియుడిపై అరండల్ పేట స్టేషన్‌లో కేసు నమోదైంది. కొరిటెపాడుకి చెందిన ఓ యువతి, ప్రకాశం(D)యువకుడు కళాశాల రోజుల్లో ప్రేమించుకున్నారు. అయితే ఆ యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దీంతో మాజీ ప్రియుడు ప్రేమించే సమయంలో యువతిని ఏకాంతంగా కలిసిన వీడియోలను భర్త, తండ్రికి పంపిస్తున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News March 3, 2026
ఈ నెల 23న డీసీఎంఎస్ సర్వసభ్య సమావేశం

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డీసీఎంఎస్ సర్వసభ్య సమావేశం ఈ నెల 23న నిర్వహిస్తున్నట్లు ఛైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి తెలిపారు. కాకినాడలోని డీసీఎంఎస్ కార్యాలయంలో మంగళవారం ముందస్తు సమీక్ష నిర్వహించి ఏర్పాట్లపై చర్చించారు. ఈ సమావేశానికి సభ్యులు, అధికారులు అందరూ విధిగా హాజరుకావాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ సీఈవో, బాపిరాజు, మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
News March 3, 2026
ఇందుకూరుపేట: వేటకు వెళ్లి ఒకరు మృతి

ఇందుకూరుపేట మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గంగపట్నం ఎస్సీ కాలనీకి చెందిన ఏలూరు వెంకటరమణయ్య చేపల వేట కోసం సమీపంలోని ఉప్పుటేరుకు వెళ్లారు. అక్కడ వేట సాగిస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆయనను బయటకు తీశారు. అయితే దురదృష్టవశాత్తు అప్పటికే వెంకటరమణయ్య ప్రాణాలు కోల్పోయారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.
News March 3, 2026
మెట్రో ఫేజ్-2 వారసత్వ కట్టడాల సవాలు

HYD మెట్రో ఫేజ్-2 విస్తరణలో పాతబస్తీ కారిడార్ ఇప్పుడు అధికారులకు పరీక్షగా మారింది. వారసత్వ కట్టడాల రక్షణపై హైకోర్టు నిబంధనలు కఠినంగా ఉండటంతో అలైన్‌మెంట్‌లో సాంకేతిక మార్పులు తప్పనిసరయ్యాయి. అటు L అండ్ T నుంచి ప్రాజెక్టు బాధ్యతల బదిలీపై ప్రభుత్వ కసరత్తు సాగుతుండగా ₹42,000 కోట్ల భారీ వ్యయంలో కేంద్రం 20% వాటాపై ఇంకా స్పష్టత రాలేదు. ట్రాఫిక్ డెన్సిటీ అంచనాలపై కేంద్రం కొర్రీలు వేస్తున్నట్లు సమాచారం.


