News March 1, 2026
ఖమ్మం: కుక్కకాటుపై ఆందోళన వద్దు: డీఎంహెచ్‌ఓ

ఖమ్మం జిల్లాలో కుక్కకాటు ఘటనల నేపథ్యంలో ప్రజలు భయాందోళన చెందవద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రామారావు స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా టీకాలు, మందులు అందుబాటులో ఉన్నాయని భరోసా ఇచ్చారు. ముజుగూడెం బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని, ఒకరిని ఖమ్మం ప్రధాన ఆస్పత్రికి తరలించామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సమీప ఆస్పత్రిని సంప్రదించాలని సూచించారు.
Similar News
News March 3, 2026
నేడు ఖమ్మం కమిషనరేట్‌లో మద్యం దుకాణాలు బంద్

హోలీ పండుగను పురస్కరించుకుని ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి మార్చి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు, బార్లు, కల్లు దుకాణాలు బంద్ చేయాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News March 3, 2026
పిడుగుల నుంచి విద్యుత్ రక్షణ.. 109 అరెస్టర్ల ఏర్పాటు

రుములు, మెరుపుల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ఖమ్మం సర్కిల్ వ్యాప్తంగా 109లైట్నింగ్ అరెస్టర్లను ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఈ శ్రీనివాస చారి తెలిపారు. పిడుగుల నుంచి వచ్చే అధిక వోల్టేజ్‌ను ఇవి భూమిలోకి మళ్లించి ఉపకరణాలను కాపాడుతాయని వివరించారు. ముందస్తు చర్యలతో వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో వినియోగదారులు కూడా విద్యుత్ పరికరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News March 2, 2026
99 రోజుల ప్రగతి ప్రణాళికను పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్

ప్రభుత్వం చేపట్టిన ‘99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ను కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు సాగే ఈ కార్యాచరణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ, నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం లక్ష్యాలను చేరుకోవాలని స్పష్టం చేశారు.


