News March 1, 2026
కృష్ణా: డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో జనవరి 2026లో నిర్వహించిన డిగ్రీ 1వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షలు ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు కృష్ణా యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చని KRU పరీక్షల విభాగం అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
Similar News
News April 15, 2026
తెలంగాణ స్క్వాష్ జట్టు కోచ్‌గా నిజామాబాద్ వాసి

నిజామాబాదు జిల్లా డిచ్‌పల్లి మండలం యానంపల్లి గ్రామానికి చెందిన బీ.దీపక్ కుమార్ ఈ నెల ఏప్రిల్ 16 – 22 వరకు న్యూ ఢిల్లీలో జరిగే 69వ జాతీయ స్థాయి స్క్వాష్ క్రీడా పోటీలకు ఎంపికయ్యారని పీడీ రాము తెలిపారు. జిల్లా యువకుడు ఈ ఎంపిక పట్ల యానంపల్లి గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
News April 15, 2026
AP, TGలో ఎన్ని లోక్‌సభ స్థానాలు పెరుగుతాయ్?

లోక్‌సభ స్థానాల పునర్విభజనతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ముఖచిత్రం మారనుంది. మొత్తం సీట్లు 850కి (54.54%) పెరిగితే.. ప్రస్తుతం ఉన్న స్థానాలకు అదనంగా ఏపీలో 14, తెలంగాణలో 9 సీట్లు కలవనున్నాయి. అంటే ఏపీలో మొత్తం ఎంపీ సీట్లు 39కి, తెలంగాణలో 26కి చేరతాయి. ఒకవేళ పెంపు 50%కే పరిమితమైతే APలో 13 సీట్లు మాత్రమే పెరుగుతాయి. దక్షిణాదిలో 50% అయితే 65 సీట్లు, 54.54% అయితే 71 స్థానాలు పెరుగుతాయి.
News April 15, 2026
ADB: పల్లెకు చేరువయ్యేనా ‘ప్రగతి చక్రం’?

జిల్లా పర్యటనకు వస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌పై పల్లెవాసులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ‘మహాలక్ష్మి’ పథకంతో బస్సులకు రద్దీ పెరిగినా, తిర్యాణి, నార్నూర్, బజార్‌హత్నూర్, భీంపూర్ వంటి మారుమూల మండలాల్లోని గిరిజన గూడాలకు నేటికీ ఆర్టీసీ సౌకర్యం కలగానే మిగిలింది. వర్షాకాలంలో వాగులు పొంగి రవాణా నిలిచిపోతుండటంతో విద్యార్థులు, రోగులు అల్లాడుతున్నారు. అన్ని కాలాల్లో బస్సు నడపాలని కోరుతున్నారు.


