News March 1, 2026
HYD: నకిలీ ఇన్సూరెన్స్‌లు.. 9 మంది అరెస్ట్

ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల పేర్లతో నకిలీ వాహన బీమా పత్రాలను సృష్టిస్తున్న 9మంది ముఠా సభ్యులను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీగా నకిలీ పత్రాలు, స్టాంపులు, కంప్యూటర్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేశ్ వెల్లడించారు. అవసరంలో ఉన్న వాహనదారులను లక్ష్యంగా చేసుకుని మోసాలు చేస్తున్నారు. ప్రజలు అధికారిక వెబ్‌సైట్ల ద్వారానే బీమా తీసుకోవాలని పోలీసులు సూచించారు.
Similar News
News March 3, 2026
సంగారెడ్డిలో సదరం శిబిరాల షెడ్యూల్ విడుదల

సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో మార్చి నెలకు సంబంధించిన ‘సదరం’ శిబిరాల షెడ్యూల్‌ను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ మంగళవారం విడుదల చేశారు. ఈ నెల 4, 11, 18, 25 తేదీల్లో ఈ శిబిరాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దివ్యాంగులు ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలని, నిర్ణీత తేదీల్లో ఉదయాన్నే ఆసుపత్రికి చేరుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమతో పాటు తగు ధ్రువపత్రాలను వెంట తీసుకురావాలని పేర్కొన్నారు.
News March 3, 2026
కడప జిల్లాలోని AMCల్లో ఉద్యోగుల ఖాళీలు ఎన్నంటే.!

కడప జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో <<19285111>>110 మంది<<>> దాకా ఉద్యోగుల కొరత ఉంది. కడపలో 41 మందికి గాను 9 మంది, ప్రొద్దుటూరులో 25 మందికి గాను 6, బద్వేల్‌లో 15 మందికి గాను 4, జమ్మలమడుగులో 10 మందికి గాను 4, రాజంపేటలో 8 మందికి గాను ముగ్గురు, మైదుకూరులో 12 మందికి గాను నలుగురు, కమలాపురంలో 8 మందికి గాను ఇద్దరు, ఎర్రగుంట్లలో 8 మందికి గాను ఇద్దరు, సింహాద్రిపురంలో 6 మందికి గాను ఇద్దరు మాత్రమే ఉద్యోగులు ఉన్నారు.
News March 3, 2026
KUలో పార్ట్ టైం పోస్టుల దరఖాస్తులకు రేపే లాస్ట్

కేయూలోని వివిధ విభాగాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పార్ట్ టైం బోధనా సిబ్బంది నియామక దరఖాస్తు గడువును పొడిగించినట్లు రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం తెలిపారు. ఫిబ్రవరి 28తో ముగియాల్సిన గడువును అభ్యర్థుల అభ్యర్థన మేరకు మార్చి 4 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు కేయూ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.


