News March 1, 2026
ములుగు: CG మావోయిస్టుల డంప్ స్వాధీనం

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లాలో పోలీసులకు భారీ విజయంలభించింది. నక్సలైట్లు రెండు వేర్వేరు ప్రదేశాల్లో దాచిన డంప్‌లపై శనివారం దాడులు నిర్వహించి రూ.46,31,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. రెండో డంప్‌లో భారీ ఆయుధాలు, కార్ట్రిడ్జ్‌లు, ఎలక్ట్రానిక్ సామగ్రి పట్టుబడ్డాయి. ఇప్పటివరకు భద్రతా దళాలు మొత్తం రూ.1.08 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News March 4, 2026
గుండ్ల సింగారం కెనాల్‌లో లభ్యమైన మృతదేహం

ఎస్ఆర్ఎస్పీ కాలువలో పడి గల్లంతైన భీమారం వాసి సాంబయ్య మృతదేహం బుధవారం లభ్యమైంది. సోమవారం సాయంత్రం గుండ్లసింగారం వద్ద ప్రమాదవశాత్తు కాలువలో పడి ఆయన కొట్టుకుపోయారు. కేయూసీ సీఐ రవికుమార్ తెలిపిన వివరాలు.. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా, పలువేల్పుల ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
News March 4, 2026
మురికివాడలో టూరిజం.. 2 గం.కు రూ.15,000!

ముంబైలోని ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ‘ధారవి’ని చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. వింతగా అనిపించినా.. ఇక్కడి జీవనశైలిని, కుటీర పరిశ్రమలను చూపించేందుకు గైడ్లు ఒక్కో వ్యక్తి నుంచి 2 గంటలకు రూ.15,000 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విదేశీయులు ఈ ‘స్లమ్ టూరిజం’పై ఆసక్తి చూపుతున్నారట. పేదరికాన్ని కూడా ఒక వ్యాపారంగా మార్చడంపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
News March 4, 2026
విద్యార్థులకు ఆన్‌లైన్ క్విజ్ పోటీలు

జాతీయ సైన్స్ డే వారోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో అమలాపురంలో ఆన్‌లైన్ క్విజ్ నిర్వహించారు. డీఈవో పి. నాగేశ్వరరావు ఈ పోటీలను ప్రారంభించారు. ఇందులో 262 ప్రభుత్వ, 108 ప్రైవేట్ పాఠశాలల నుంచి 6, 7, 8 తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నెల 6న 30 పాఠశాలలకు రెండో రౌండ్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా సైన్స్ అధికారి జి.వి.ఎస్. సుబ్రహ్మణ్యం వెల్లడించారు.


