News March 1, 2026
సిద్దిపేట: ప్రేమను నిరాకరించడంతో బాలిక సూసైడ్!

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో ప్రేమ వ్యవహారం ఓ బాలిక ప్రాణం తీసింది. యువతి అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించగా, వరుసకు అన్నాచెల్లెలు కావడంతో పెద్దలు పెళ్లికి నిరాకరించారు. దీంతో మనస్తాపం చెందిన బాలిక FEB 23న పురుగుల మందు తాగింది. జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ చంద్రమోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 5, 2026
నెలకు రూ.40వేల జీతం.. ముంబై పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

ముంబై పోర్ట్ అథారిటీ 10 జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ పోస్టులను భర్తీ చేయనుంది. బీకామ్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. నెలకు రూ.40,000 చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://mumbaiport.gov.in
News March 5, 2026
సచిన్‌లాగే అర్జున్.. వయసులో పెద్ద అమ్మాయితో వివాహం!

సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహం ఈరోజు ముంబైలో జరగనుంది. బిజినెస్ ఫ్యామిలీకి చెందిన సానియా చందోక్‌ను ఆయన పెళ్లాడనున్నారు. సానియా కంటే అర్జున్ ఒక సంవత్సరం చిన్నవాడు కావడం గమనార్హం. అర్జున్ 1999 SEP 24న, సానియా 1998 జూన్ 23న జన్మించారు. ఈ నేపథ్యంలో వీరి వయసు వ్యత్యాసం చర్చనీయాంశంగా మారింది. కాగా అర్జున్ పేరెంట్స్ సచిన్(52), అంజలి(58) మధ్య వయసు తేడా ఆరేళ్లు. 1995లో వారికి వివాహమైంది.
News March 5, 2026
విజయవాడలో IAS అని నమ్మించి.. రూ.10 లక్షల మోసం

రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానంటూ కానూరుకు చెందిన నాగమణిని మురళి అనే వ్యక్తి భారీగా మోసం చేశాడు. తాను ఐఏఎస్ అధికారిగా సెలక్ట్ అయ్యానని నమ్మించి, పలు దఫాలుగా ఆమె నుంచి రూ.10 లక్షలు వసూలు చేశాడు. ఎంతకీ ఉద్యోగం రాకపోవడంతో బాధితురాలు కృష్ణలంక పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు మురళిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.


