News March 1, 2026
మార్కాపురం: ‘కళాశాలే లేదు.. పరీక్షలు మాత్రం రాస్తారు’

మార్కాపురంలో BED పరీక్షలు జరుగుతున్నాయి. సుమారు 10 కళాశాలలకు సంబంధించిన విద్యార్థులకు 5 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే వారు చదువుతున్న కళాశాల ఎక్కడో వారికే తెలీదు. మధ్యవర్తులు హాల్ టికెట్ ఇస్తే పరీక్ష రాస్తారు అంతే. కళాశాల భవనాలు కూడా ఉండవు కానీ అందుకు సంబంధించిన పత్రాలు మాత్రం ఉంటాయి. ఇలాంటి ఆఫర్ ఇతర రాష్ట్రాల వారికేనట. ఈ పరిస్థితి కందుకూరులోనూ ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News March 5, 2026
CS.పురం PSలో మొక్క నాటిన SP

మార్కాపురం జిల్లా చంద్రశేఖరాపురం మండల కేంద్రం పోలీస్ స్టేషన్‌ను జిల్లా SP హర్షవర్ధన్ రాజు బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డుల నిర్వహణను పరిశీలించి తగు సూచనలు చేశారు. బిల్డింగ్ కేసులు వివరాలు, రోడ్డు భద్రత తదితర అంశాలపై తీసుకుంటున్న చర్యలు CI మాకినేని శ్రీనివాసరావు, వెంకటేశ్వర నాయక్‌తో చర్చించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.
News March 4, 2026
ప్రకాశం జిల్లాలో దారుణ హత్య

చీమకుర్తి (M)లో బుధవారం దారుణ హత్య జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. బూదవాడలోని గ్రానైట్ కటింగ్ ఫ్యాక్టరీలో ఇద్దరు రాజస్థాన్ కార్మికుల మధ్య జరిగిన ఆర్థిక వివాదం హత్యకు దారి తీసింది. హత్యకు గురైన వ్యక్తి ఓం ప్రకాశ్ (35)గా గుర్తించారు. హత్య చేసిన వ్యక్తిని చీమకుర్తి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రూ.2వేల కోసం ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 4, 2026
మళ్లీ ఘాటెక్కిన ఒంగోలు రాజకీయం

ఒంగోలు రాజకీయం మళ్లీ ఘాటెక్కింది. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి మధ్య మాటల యుద్ధం మళ్లీ మొదలైంది. డ్వాక్రా గ్రూపుల్లో అవినీతి జరిగిందని, అది ఎవరు చేశారో ఒంగోలులోని ప్రజలకు తెలుసు అని బాలినేని పేర్కొన్నారు. ఇప్పటికే దీనిపై ఫిర్యాదు చేశామని, ఆయన కూడా ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఉన్నారని, కలెక్టర్‌తో స్పెషల్ ఎంక్వైరీ వేపించుకోవాలని దామచర్ల సమాధానం ఇచ్చారు.


