News March 1, 2026

పోలవరం: పులి సంచారం.. భయం.. భయం

image

పోలవరం జిల్లాలో పెద్దపులి సంచరిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆదివారం ఉదయం పెద్దపులి వివిధ ప్రాంతాల్లో కొందరికి కనిపించింది అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ ప్రచారం నిజం కాదని అటవీశాఖ అధికారులు తెలిపారు. అయితే నిన్నట్నుంచి రంపచోడవరం(M) తాళ్లపాలెం గ్రామ సమీపంలో పులి ఉందని, అటవీ అధికారులు పులికి గస్తీ కాస్తూ, పులి కదలికలను గమనిస్తూ ఉన్నారు.

Similar News

News March 4, 2026

WGL: రూ.680 కోట్ల పెండింగ్.. ‘సర్టిఫికెట్’ చిక్కులు!

image

ఉమ్మడి జిల్లాలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. మూడు విద్యా సంవత్సరాలకు సంబంధించి సుమారు రూ.570 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉండగా, ప్రస్తుత ఏడాదితో కలిపి ఆ మొత్తం రూ.680 కోట్లకు చేరనుంది. ఫలితంగా కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను పట్టుకుని కూర్చున్నాయి. జిల్లాలో సుమారు లక్ష మంది విద్యార్థులు, అందులోనూ సగం మంది బీసీలే ఉండటం గమనార్హం.

News March 4, 2026

మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంపై దాడి.. నిందితుడికి రిమాండ్

image

మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇటీవల 2 కార్లను ధ్వంసం చేయడంతో పాటు భద్రతా సిబ్బందిపై దాడిచేసిన వ్యక్తిని మంగళవారం రిమాండ్‌కి పంపినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. పార్టీ కార్యాలయ భద్రతా సిబ్బంది RI పెంటారావు ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన నీలాద్రిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి మంగళగిరి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించారు.

News March 4, 2026

జొమాటో, స్విగ్గీలకు పోటీగా ర్యాపిడో ‘ఓన్లీ’

image

ర్యాపిడో తన ఫుడ్ డెలివరీ యాప్ ‘ఓన్లీ’ (Ownly) సేవలను బెంగళూరు వ్యాప్తంగా ప్రారంభించింది. గత 7 నెలలుగా కోరమంగళ, HSR లేఅవుట్ వంటి ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా నడిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. జొమాటో, స్విగ్గీలు రెస్టారెంట్ల నుంచి 16-30% వరకు కమీషన్ వసూలు చేస్తుంటే ‘ఓన్లీ’ మాత్రం వారి నుంచి ₹400 కంటే తక్కువ ఆర్డర్లకు ₹25, ఎక్కువ వాటికి ₹50 ఫిక్స్‌డ్ ఫీజు కలెక్ట్ చేయనుంది.